Ind Vs WI: Rohit-Jaiswal breaks Sehwag-Jaffer's 17-year-old record - Sakshi
Sakshi News home page

Rohit- Yashasvi: సరికొత్త చరిత్ర సృష్టించిన రోహిత్‌- యశస్వి.. 17 ఏళ్ల రికార్డు బద్దలు

Published Fri, Jul 14 2023 4:06 PM | Last Updated on Fri, Jul 14 2023 4:55 PM

Ind Vs WI: Rohit Yashasvi History Breaks Sehwag Jaffer 17 Year Old Record - Sakshi

West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడం టీమిండియాకు కలిసివచ్చింది. దీంతో డొమినికా వేదికగా విండ్సర్‌ పార్క్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ సేన పట్టు బిగించింది. కాగా విండీస్‌తో టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ముంబై బ్యాటర్‌ యశస్వి వ్యక్తిగతంగా పలు రికార్డులు సాధించిన విషయం తెలిసిందే.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా ఓపెనర్‌గా వచ్చిన యశస్వి రెండో రోజు ఆట ముగిసే సరికి 143 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇప్పటి వరకు మొత్తంగా 350 బంతులు ఎదుర్కొన్న అతడు 14 ఫోర్ల సాయంతో ఈ మేరకు స్కోరు చేశాడు. మరోవైపు.. రోహిత్‌ 221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు.

17 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కొత్త జోడీ
ఈ క్రమంలో వీరిద్దరు సెహ్వాగ్‌- జాఫర్‌ పేరిట ఉన్న 17 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. కాగా డొమినికా టెస్టులో ఓపెనర్లు రోహిత్‌- యశస్వి 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వెస్టిండీస్‌పై టెస్టుల్లో భారత ఓపెనింగ్‌ జోడీకి ఇదే అత్యధిక పార్ట్‌నర్‌షిప్‌ కావడం విశేషం.

గతంలో 2006లో గ్రాస్‌ ఐస్లెట్‌ టెస్టు సందర్భంగా నాటి ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌- వసీం జాఫర్‌ 159 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయగా.. రోహిత్‌- యశస్వి జోడీ ఇప్పుడు వాళ్లను అధిగమించింది. ఇక ఈ జాబితాలో సునిల్‌ గావస్కర్‌- చేతన్‌ చౌహాన్‌ 153, సునిల్‌ గావస్కర్‌- అన్షుమన్‌ గైక్వాడ్‌ 136 పరుగుల భాగస్వామ్యంతో ఈ జోడీల తర్వాతి స్థానాలు ఆక్రమించారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సరికి విండీస్‌ మీద 162 పరుగుల ఆధిక్యంతో ఉంది.

చదవండి: Ind Vs WI: ఏరికోరి వచ్చావు! ఏమైందిపుడు? అప్పుడు కూడా ఇలాగే! మార్చుకో..
విండీస్‌ ఆటగాడిపై జైశ్వాల్‌ దూషణల పర్వం; కోహ్లి సీరియస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement