అరంగేట్ర మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు భారత బౌలర్ రవి బిష్ణోయి. తన గూగ్లీలతో వెస్టిండీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. 4 ఓవర్లు వేసిన రవి... 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇందులో 17 డాట్‌బాల్స్ ఉండటం మరో విశేషం. మొదటి మ్యాచ్ కాబట్టి కాస్త తడబడిన రవి బిష్ణోయి 6 వైడ్ బాల్స్ వేసినప్పటికీ... ఓవరాల్‌గా సూపర్బ్ అనిపించుకున్నాడు. టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
అరంగేట్రంలోనే ఈ అవార్డు గెలిచి తన పేరిట ఓ రికార్డు నెలకొల్పాడు రవి బిష్ణోయి. అంతర్జాతీయ టీ20 డెబ్యూ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో భారత ఆటగాడిగా నిలిచాడు. రవి కంటే ముందు దినేశ్ కార్తిక్, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్, ప్రజ్ఞాన్ ఓజా, అక్షర్ పటేల్, బరీందర్ స్రాన్, నవదీప్ సైనీ, హర్షల్ పటేల్ ఈ ఫీట్ నమోదు చేశారు. కాగా టి20 క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడిగా రాజస్తాన్‌కు చెందిన రవి బిష్ణోయి నిలిచాడు.
కల నిజమైంది.. కానీ ఇది ఊహించలేదు..
అవార్డు గెలిచిన అనంతరం రవి బిష్ణోయి మాట్లాడుతూ... ‘‘టీమిండియాకు ఆడాలన్న నా కల నెరవేరింది. ఎంతో సంతోషంగా ఉంది. టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ బలమైన జట్టు. కాబట్టి తొలుత కాస్త కంగారుగా అనిపించింది. అయితే, నా శక్తిమేర జట్టుకు ఉపయోగపడాలని భావించాను. మంచు కారణంగా కాస్త ఇబ్బంది తలెత్తినా... బాగానే బౌలింగ్ చేయగలిగాను.
అయితే, మొదటి మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదు. నాకు నిజంగా ఇది ఎంతో ప్రత్యేకం’’అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా వెస్టిండీస్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.
చదవండి: Ind Vs WI 1st T20: 'అది వైడ్‌బాల్ ఏంటి' రోహిత్ అసహనం.. కోహ్లి సలహా
From nerve & verve to a dream #TeamIndia debut!👏 👏
— BCCI (@BCCI) February 17, 2022
In his maiden Chahal TV appearance, @bishnoi0056 shares his emotions with @yuzi_chahal after India's win in the 1⃣st @Paytm #INDvWI T20I. ☺️ 😎 - By @Moulinparikh
Watch the full interview 🎥 🔽https://t.co/HTjXQGKlg3 pic.twitter.com/5dMyWXUblu
Comments
Please login to add a commentAdd a comment