ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సెంచరీతో కదం తొక్కాడు. 87 పరుగుల వ్యక్తిగత ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ మొదలపెట్టిన కోహ్లి 180 బంతుల్లో 10 ఫోర్లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఇది విరాట్‌కు విదేశీ గడ్డపై 55 నెలల తర్వాత తొలి టెస్టు సెంచరీ కావడం గమనార్హం.
అదే విధంగా ఇది విరాట్‌కు 29వ టెస్టు సెంచరీ, ఓవరాల్‌గా 76వ అంతర్జాతీయ శతకం కావడం విశేషం. అంతేకాకుండా తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 206 బంతుల్లో 121 పరుగులు చేసిన కోహ్లి.. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు.
ఏం జరిగిందంటే..
భారత ఇన్నింగ్స్ 99వ ఓవర్ వేసిన వారికన్ బౌలింగ్‌లో రెండో బంతికి కోహ్లి డిఫెన్స్ ఆడాడు. బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని స్వ్కేర్ లెగ్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో కోహ్లి రిస్కీ సింగిల్ కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో జోషఫ్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు త్రో చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు. అయితే కోహ్లి అద్భుతమైన డైవ్ చేసినప్పటికి క్రీజులోకి చేరుకోలేకపోయాడు. దీంతో థర్డ్ అంపైర్ రనౌట్‌గా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో అతడు అభిమానులు స్పందిస్తూ.. "అయ్యో కోహ్లి ఎందుకు అనవసర రన్‌కు వెళ్లావు,అలా ఔట్ అవుతావని అస్సలు అనుకోలేదు" కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలో తొలి ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment