తొలి ఐసీసీ టైటిల్ సాధించాలని పట్టుదలతో ప్రోటీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. మహిళల టీ20 ప్రపంచకప్-2023 తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 5 పరుగుల తేడాతో భారత్ పరాజాయం పాలైంది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మన అమ్మాయిలు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడారు.
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. భారీ లక్ష్య చేధనలో భారత్ 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో జమీమా రోడ్రిగస్ , కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టును ఆదుకున్నారు.
వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం రోడ్రిగస్ (24 బంతుల్లో 43) పరుగులు చేసి పెవిలియన్‌ను చేరింది. ఈ క్రమంలో జట్టును గెలిపించే పూర్తి బాధ్యతను కెప్టెన్ హర్మన్ తన భుజాలపై వేసుకుంది.
కొంపముంచిన రనౌట్..
అయితే వరుస క్రమంలో బౌండరీలు బాదుతూ హర్మన్ ఆసీస్ బౌలర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఆ సమయంలో భారత విజయం ఖాయమని అంతా భావించారు. ఇక్కడే భారత్‌ను దురదృష్టం వెంటాడింది. ఆనూహ్య రీతిలో హర్మన్ (34 బంతుల్లో 52) రనౌట్‌గా వెనుదిరిగింది. భారత ఇన్నింగ్స్ 15 ఓవర్‌లో నాలుగో బంతికి హర్మన్ భారీ షాట్ ఆడింది.
అయితే బంతిని ఆసీస్ ఫీల్డర్ గార్డనర్ అద్భుతంగా బౌండరీ లైన్ దగ్గర అడ్డుకుంది. ఈ క్రమంలో కౌర్, రిచా తొలి పరుగు పూర్తి చేసుకుని రెండో రన్‌కు ప్రయత్నించారు. అయితే రెండో రన్‌కు వెళ్లేటప్పుడు ఆనారోగ్యంతో బాధపడుతున్న హర్మన్ వేగంగా పరిగెత్తలేకపోయింది.
క్రీజ్‌కు కొద్ది దూరంలో బ్యాట్ మైదానంలో దిగబడినట్లు అయిపోవడంతో.. వెంటనే వికెట్ కీపర్ హీలీ స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో మ్యాచ్ ఆసీస్ వైపు మలుపు తిరిగిపోయింది. ఇక జ్వరంతో బాధపడుతూనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
చదవండి: T20 WC semifinal: పోరాడి ఓడిన టీమిండియా.. అయ్యో హర్మన్!
Tough luck Team India. #HarmanpreetKaur & #JemimahRodrigues looked like taking the game away but the Aussies fought back brilliantly & in the end India have fallen short. Harmanpreet’s runout was the turning point & India will be disappointed to miss out on the finals. #INDWvAUSW pic.twitter.com/RY06QHDrE0
— VVS Laxman (@VVSLaxman281) February 23, 2023
Heartbreak💔💔💔 pic.twitter.com/W5uBYHci3q
— Abhishek Sandikar (@Elonmast23) February 23, 2023
చదవండి: T20 WC semifinal: పోరాడి ఓడిన టీమిండియా.. అయ్యో హర్మన్!
Comments
Please login to add a commentAdd a comment