ఈ ఏడాది నవంబర్‌లో టీమిండియా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. నవంబర్ 8, 10, 13, 15 తేదీల్లో నాలుగు టీ20లు వివిధ వేదికలపై జరుగనున్నాయి. ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసార హక్కులను స్పోర్ట్స్ 18 దక్కించుకుంది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి.
తొలి టీ20: డర్బన్
రెండో టీ20: సెయింట్ జార్జ్స్ పార్క్
మూడో టీ20: సెంచూరియన్
నాలుగో టీ20: జోహన్సెస్‌బర్గ్
కాగా, ఈ సిరీస్‌కు ముందు భారత్ స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్ట్, టీ20 సిరీస్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి రెండు టెస్ట్‌లు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ భారత్‌లో పర్యటించనుంది. అనంతరం అక్టోబర్ 16 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ భారత్‌లో పర్యటించనుంది. ఈ ఏడాది చివర్లో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.
ఈ ఏడాది టీమిండియా షెడ్యూల్..
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ పర్యటన మొదలు..
సెప్టెంబర్ 19-23: తొలి టెస్ట్ (చెన్నై)
సెప్టెంబర్ 27-అక్టోబర్ 1: రెండో టెస్ట్ (కాన్పూర్)
అక్టోబర్ 6-తొలి టీ20
అక్టోబర్ 9- రెండో టీ20
అక్టోబర్ 12- మూడో టీ20
అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్ పర్యటన మొదలు..
అక్టోబర్ 16-20: తొలి టెస్ట్ (బెంగళూరు)
అక్టోబర్ 24-28: రెండో టెస్ట్ (పూణే)
నవంబర్ 1-5: మూడో టెస్ట్ (ముంబై)
నవంబర్ 22 నుంచి భారత్.. ఆస్ట్రేలియా పర్యటన మొదలు..
నవంబర్ 22-26: తొలి టెస్ట్ (పెర్త్)
డిసెంబర్ 6-10: రెండో టెస్ట్ (అడిలైడ్)
డిసెంబర్ 14-18: మూడో టెస్ట్ (బ్రిస్బేన్)
డిసెంబర్ 26-30: నాలుగో టెస్ట్ (మెల్‌బోర్న్)
జనవరి 3-7: ఐదో టెస్ట్ (సిడ్నీ)
Comments
Please login to add a commentAdd a comment