India Vs England ODI T20 Series: ECB Announced Squads Root Returns ODI - Sakshi
Sakshi News home page

India Vs England ODI - T20 Series: టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్‌ ‘జట్ల’ ప్రకటన.. వారిద్దరి ఎంట్రీ!

Published Fri, Jul 1 2022 7:39 PM | Last Updated on Fri, Jul 1 2022 8:25 PM

India Vs England ODI T20 Series: ECB Announced Squads Root Returns ODI - Sakshi

బెన్‌ స్టోక్స్‌, జో రూట్‌(PC: ECB)

Ind Vs Eng: ECB 15 Member Squad For ODI Series: టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలు శుక్రవారం వెల్లడించింది. 

కాగా ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌ సిరీస్‌లో భాగంగా గత నెలలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు దూరమైన సీనియర్లు జో రూట్‌, బెన్‌స్టోక్స్‌ పునరాగమనం చేయనున్నారు. కొత్త కెప్టెన్‌ బట్లర్‌ నాయకత్వంలో ఆడనున్నారు.

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్‌ 15 మంది సభ్యుల జట్టు:
జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, జానీ బెయిర్‌ స్టో, హ్యారీ బ్రూక్‌, బ్రైడన్‌ కార్సే, సామ్‌ కరన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, క్రెయిగ్‌ ఓవర్టన్‌, మ్యాట్‌ పార్కిన్సన్‌, జో రూట్‌, జేసన్‌ రాయ్‌, ఫిల్‌ సాల్ట్‌, బెన్‌ స్టోక్స్‌, రీస్‌ టోప్లే, డేవిడ్‌ విల్లే. 

ఇదిలా ఉంటే.. టీమిండియాతో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్‌ 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వన్డే జట్టులో ఉన్న టెసుట​ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, జానీ బెయిర్‌ స్టోలకు విశ్రాంతినిచ్చింది. కాగా జులై 7 నుంచి టీ20,  జులై 12 నుంచి వన్డే సిరీస్‌ ఆరంభం కానున్నాయి. 

Ind Vs Eng: England T20 Squad: టీమిండియాతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు:
జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, హ్యారీ బ్రూక్‌, సామ్‌ కరన్‌, రిచర్డ్‌ గ్లెసన్‌, క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలన్‌, టైమల్‌ మిల్స్‌, మ్యాట్‌ పార్కిన్సన్‌, జేసన్‌ రాయ్‌, ఫిల్‌ సాల్ట్‌, రీస్‌ టోపప్లే, డేవిడ్‌ విల్లే.

చదవండి: Ind Vs Eng 5th Test: అప్పుడంటే కోహ్లిని బద్నాం చేశారు.. మరి ఇప్పుడో?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement