ఆసియాకప్-2023లో భాగంగా సోమవారం పసికూన నేపాల్‌తో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.
మ్యాచ్ జరిగే సమయంలో 90 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది. అలాగే పిడుగులు పడే అవకాశం 27 శాతంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
కాగా సోమవారం ఉదయం నుంచి కూడా అక్కడ వర్షం కురిసే ఛాన్స్ ఉంది . ఇక ఇప్పటికే ఇదే మైదానంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో కనీసం నేపాల్‌తో మ్యాచ్‌కైనా వరుణుడు కరుణించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
నేపాల్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
చదవండి: Asia Cup 2023: టీమిండియాకు గుడ్‌న్యూస్.. స్టార్ ఆటగాడు వచ్చేస్తున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment