Breadcrumb
India Vs Sri Lanka 1st Test: మూడు రోజుల్లోనే ఖతం.. తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం
Published Sun, Mar 6 2022 9:32 AM | Last Updated on Sun, Mar 6 2022 4:13 PM
Live Updates
మూడు రోజుల్లోనే ఖేల్‌ఖతం.. తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం
మూడు రోజుల్లోనే ఖేల్‌ఖతం.. తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 222 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 400 పరుగులు వెనుకబడి ఫాలోఆన్ ఆడిన లంక.. టీమిండియా బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకే తోకముడిచింది. లంక బ్యాట్స్మెన్లలో నిరోషన్ డిక్వెల్లా 51 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
టీమిండియా స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్ చెరో నాలుగు వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచారు. షమీ రెండు వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయడమే గాక.. బ్యాటింగ్‌లోనూ 175 పరుగులు నాటౌట్‌తో మెరిసిన జడేజా తొలి టెస్టు మ్యాచ్ హీరోగా నిలిచాడు. ఇక కోహ్లి వందో టెస్టు ఆడుతున్న నేపథ్యంలో టీమిండియా విజయాన్ని అతనికి బహుమతిగా ఇచ్చింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. ఇక రెండో టెస్టు మార్చి 12 నుంచి 18 వరకు బెంగళూరు వేదికగా జరగనుంది.
శ్రీలంక స్కోరు: 174 ఆలౌట్ & 178 ఆలౌట్(ఫాలో ఆన్)
భారత్ స్కోరు: 578-8 డిక్లేర్
జడ్డూ దమాకా.. ఎనిమిదో వికెట్ కోల్పోయిన లంక
తొలి టెస్టులో శ్రీలంక పరాజయానికి మరింత దగ్గరైంది. లంక రెండో ఇన్నింగ్స్‌లోనూ జడ్డూ తన మ్యాజిక్ బౌలింగ్‌ను ప్రదర్శిస్తున్నాడు. తాజాగా లంబుల్డేనియా(2)ను ఔట్ చేయడం ద్వారా జడేజా నాలుగో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో లంక 153 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా ఇన్నింగ్స్ విజయానికి మరో 2 వికెట్లు మాత్రమే అవసరమున్నాయి.
టీమిండియా విజయానికి మరో మూడు వికెట్లే
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి మరో 3 వికెట్ల దూరంలో మాత్రమే ఉంది. ప్రస్తుతం లంక 40 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. డిక్వెల్లా 9, ఎంబుల్డేనియా 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.
నాలుగో వికెట్ డౌన్.. టీమిండియా విజయానికి ఇంకా ఆరు వికెట్లే
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మరోసారి మెరిశాడు. కీలక సమయంలో టీమిండియాకు వికెట్ అందించాడు. 30 పరుగులు చేసిన ధనుంజయ డిసిల్వాను జడేజా వెనక్కి పంపించాడు. దీంతో మాథ్యూస్, డిసిల్వా మధ్య ఏర్పడిన 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం శ్రీలంక 33 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. మాథ్యూస్ 21, అసలంక(0) క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా ఆరు వికెట్ల దూరంలో ఉంది.
మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. భారత్ విజయానికి ఏడు వికెట్ల దూరంలో
కెప్టెన్ దిముత్ కరుణరత్నే(27) పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో శ్రీలంక 45 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మాథ్యూస్ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా ఇన్నింగ్స్ విజయానికి మరో ఏడు వికెట్ల దూరంలో ఉంది.
లంక రెండో వికెట్ డౌన్.. టీమిండియా విజయానికి మరో 8 వికెట్లు
ఫాలోఆన్ ఆడుతున్న శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్ సెంచరీ సాధించి ఆకట్టుకున్న పాతుమ్ నిస్సంకా రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 19 పరుగుల వద్ద లంక రెండో వికెట్ కోల్పోయింది. టీమిండియా విజయానికి మరో 8 వికెట్లు మాత్రమే అవసరం ఉంది. నిస్సంకా వికెట్ అశ్విన్‌కు టెస్టుల్లో 434వ వికెట్. ఈ వికెట్‌తో అశ్విన్ కపిల్ దేవ్ సరసన నిలిచాడు.
లంచ్ విరామం.. ఫాలోఆన్ ఆడుతున్న లంక; తొలి వికెట్ డౌన్
400 పరుగులు వెనుకబడి ఫాలోఆన్ ఆడుతున్న శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. అశ్విన్ బౌలింగ్‌లో తిరిమన్నే డకౌట్‌గా వెనుదిరిగాడు. లంచ్ విరామానికి శ్రీలంక 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్ పరాజయం నుంచి తప్పించుకోవాలంటే మరో 390 పరుగులు చేయాల్సి ఉంది.
జడేజా పాంచ్ పటాకా.. లంక 174 ఆలౌట్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ దుమ్మురేపాడు. లంకతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా ఐదు వికెట్లు తీసి వారి పతనాన్ని శాసించాడు. జడ్డూ దెబ్బకు శ్రీలంక 174 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు భారీ ఆధిక్యం లభించింది. దీంతో లంక ఫాలోఆన్ ఆడడం అనివార్యమైంది. లంక బ్యాటింగ్‌లో నిస్సంకా 61 పరుగులు నాటౌట్‌తో చివరి వరకు నిలిచాడు. మిగతా బ్యాట్స్మెన్లలో అసలంక 29, కరుణరత్నే 28 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో జడేజా ఐదు, అశ్విన్ 2,బుమ్రా 2, షమీ ఒక వికెట్ తీశారు. టీమిండియా బౌలర్ల దాటికి లంక బ్యాట్స్మెన్లలో చివరి నలుగురు డకౌట్ కావడం విశేషం. ఇక జడేజాకు టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం ఇది పదోసారి. ఒకే టెస్టు మ్యాచ్‌లో 150కి పైగా పరుగులు.. ఐదు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా జడ్డూ చరిత్ర సృష్టించాడు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
173 పరుగుల వద్ద శ్రీలంక ఎనిమిదో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో ఎంబుల్దెనియా.. మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
జడేజా దెబ్బ.. లంక ఏడో వికెట్ డౌన్
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టాడు. మొదట ఇన్నింగ్స్ 61వ ఓవర్ నాలుగో బంతికి డిక్వెల్లాను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన జడ్డూ.. ఆ తర్వత ఓవర్ చివరి బంతికి సురంగ లఖ్మల్ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. దీంతో లంక 164 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నిస్సంకా మాత్రం 51 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
నిలకడగా ఆడుతున్న దశలో శ్రీలంకను స్పీడస్టర్ బుమ్రా దెబ్బకొట్టాడు. 29 పరుగులు చేసిన అసలంక బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. మొదట అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో.. బుమ్రా ఔట్ అంటూ నమ్మకంగా పేర్కొనడంతో రోహిత్ రివ్యూకు వెళ్లి ఫలితం సాధించాడు. అలా లంక 161 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
53 ఓవర్లలో లంక స్కోరు 140/4
మూడో రోజు ఆట ప్రారంభం కాగా.. శ్రీలంక 53 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. నిస్సంకా 45, అసలంక 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మూడో రోజు ఆట ప్రారంభం
భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో శ్రీలంక మూడో రోజు ఆటను ప్రారంభించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. క్రీజులో నిసాంక, అసలంక క్రీజులో ఉన్నారు. ఇక మూడో రోజు తొలి ఓవర్ వేయడానికి మహ్మద్ షమీ బౌలింగ్‌కు వచ్చాడు.
Related News By Category
Related News By Tags
-
IND VS SL 3rd ODI: శతక్కొట్టిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (89 బంతుల్లో 100; 11 ఫోర్లు, 2...
-
తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా.. 2 మార్పులు, తుది జట్టు ఎలా ఉందంటే..?
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. హార్ధిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్...
-
లంకతో మూడో వన్డే.. క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి భారత్
తిరువనంతపురం: భారత్, శ్రీలంక మధ్య టి20 సిరీస్‌లోనైనా ఫలితం చివరి మ్యాచ్ వరకు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో మాత్రం రెండో మ్యాచ్‌కే ఫలితం తేలిపోయింది. టీమిండియా 2–0తో సిరీస్ గెలుచుకోగా, చి...
-
టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సిరీస్ చిక్కింది
భారత్ లక్ష్యం 216 పరుగులే...కానీ ఏమాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై షాట్లు ఆడటమే కష్టంగా మారిపోయింది.. ఇలాంటి స్థితిలో విజయం కోసం భారత్ 43వ ఓవర్ వరకు శ్రమించింది... స్వల్ప ఛేదనలోనూ కాస్త త...
-
Team India: స్వదేశంలో బెబ్బులి.. మరి విదేశాల్లో, మెగా టోర్నీల్లో..?
స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో, చిన్న జట్లతో జరిగే వన్ టు వన్ సిరీస్‌ల్లో బెబ్బులిలా రెచ్చిపోయే టీమిండియా.. విదేశాల్లో జరిగే సిరీస్‌ల్లో, అలాగే పెద్ద జట్లు పాల్గొనే నాకౌట్ మెగా టోర్నీల్లో ...
Comments
Please login to add a commentAdd a comment