భారత్-బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాలగా సిద్దమైంది.
పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ విజయంతో భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాకు చుక్కులు చూపించేందుకు రోహిత్ సేన ప్రత్యేక వ్యూహాలు రచించింది. బంగ్లా పులల బెండు తీసేందుకు చెపాక్‌లో రెడ్ సోయిల్ పిచ్‌ను భారత జట్టు మెనెజ్‌మెంట్ తాయారు చేయించినట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే భారత పేస్ బౌలర్ల దాటికి పర్యాటక జట్టు బెంబేలెత్తెక తప్పదు. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా బంగ్లాతో సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్న యువ క్రికెటర్ల గురించి హిట్‌మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"జైశ్వాల్, జురుల్, సర్ఫరాజ్ అద్బుతమైన యువ ఆటగాళ్లు. వారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. వారు తమ సత్తా ఏంటో ఇప్పటికే క్రికెట్ ప్రపంచానికి చూపించారు. ఈ యువ క్రికెటర్లకు మనం ఎక్కువగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ముగ్గురికి వారి రోల్స్‌పై ఒక స్పష్టత ఉంది. ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్నారు.
జైశ్వాల్ మాకు దొరికిన అణిముత్యం. ఓపెనర్‌గా వచ్చి మంచి అరంభాలను అందిస్తున్నాడు. ఇక జురెల్ కూడా వికెట్ల వెనక చాలా చురుగ్గా ఉన్నాడు. జురెల్ వికెట్ కీపర్ గానే కాకుండా బ్యాటర్‌గా కూడా తనను తను నిరూపించుకున్నాడు.
గత సిరీస్‌లో క్లిష్టమైన పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు విజయాన్ని అందించాడు. సర్ఫరాజ్ కూడా తన తొలి సిరీస్‌లోనే ఆకట్టుకున్నాడు. వీరిందరికి మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉంది. వారు తమ కెరీర్‌లో ముందుకు దూసుకెళ్లాలని తపనతో ఉన్నారు. నిజంగా ఇది భారత క్రికెట్‌కు శుభసూచికం అని రోహిత్ పేర్కొన్నాడు.
కాగా ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో అరంగేట్రం చేసిన జురెల్, సర్ఫరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అయితే బంగ్లాతో తొలి టెస్టుకు తుది జట్టులో జురెల్, సర్ఫరాజ్‌లకు చోటు దక్కే సూచనలు కన్పించడం లేదు. రాహుల్, పంత్ అందుబాటులో రావడంతో వీరిద్దరూ బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది.
చదవండి: WTC: అరుదైన రికార్డు ముంగిట జైస్వాల్.. 132 రన్స్ చేశాడంటే..!
Comments
Please login to add a commentAdd a comment