భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు సర్వం సిద్దమైంది. ప్రోటీస్ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో మొదటిగా వైట్ బాల్ సిరీస్‌ల కోసం భారత జట్టు గురువారం దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది.
సౌతాఫ్రికాకు చేరుకున్న భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. టీమిండియా ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది.
కాగా డిపెంబర్ 10 నుంచి టీ20 సిరీస్, డిసెంబర్ 17 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్నాయి. ఆ తర్వాత రెండు టెస్టులు జరగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం భారత సెలక్టర్లు ఇప్పటికే జట్లను ప్రకటించగా తాజాగా దక్షిణాఫ్రికా కూడా జట్లను ప్రకటించింది. టీ20ల్లో భారత జట్టు సారథిగా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక కాగా.. వన్డేల్లో కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. టెస్టుల్లో రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మనే భారత జట్టును నడిపించనున్నాడు.
భారత టీ20జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.
భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్)(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్.
దక్షిణాఫ్రికా టీ 20 జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, డొనొవాన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్.
దక్షిణాఫ్రికా వన్డే జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, మిహ్లాలీ మ్పోంగ్వానా, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, వాండర్ డసెన్, కైల్ వెరిన్నే, లిజాడ్ విలియమ్స్.
South Africa bound ✈️🇿🇦#TeamIndia are here 👌👌#SAvIND pic.twitter.com/V2ES96GDw8
— BCCI (@BCCI) December 7, 2023
Comments
Please login to add a commentAdd a comment