
భువనేశ్వర్: ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీని భారత జట్టు ఘనంగా మొదలు పెట్టింది. శనివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1 గోల్స్ తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (7వ నిమిషం, 20వ ని.) రెండు గోల్స్ సాధించగా...జుగ్‌రాజ్ సింగ్ (24వ ని.), లలిత్ ఉపాధ్యాయ్ (50వ ని.) ఒక్కో గోల్ చేశారు.
స్పెయిన్ ఆటగాళ్లలో మిరాలెస్ మార్క్ (34వ ని.) ఏకైక గోల్ కొట్టాడు. మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌కు ఇది 350వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. నేడు జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment