సోఫియా (బల్గేరియా): భారత రెజ్లర్ సుమిత్ మలిక్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నీలో సుమిత్ 125 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకొని ‘టోక్యో’ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో సుమిత్ 5–0తో జోస్ డానియల్ డియాజ్ రొబెర్టి (వెనిజులా)పై విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో సుమిత్ 10–5తో రుస్తుమ్ ఇస్కందర్ (తజికిస్తాన్)ను ఓడించాడు. మరోవైపు అమిత్ ధన్‌కర్ (74 కేజీలు), సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయారు. అమిత్ తొలి రౌండ్‌లో 6–9తో మిహైల్ సావా (మాల్డోవా) చేతిలో ఓడిపోగా... సత్యవర్త్ క్వార్టర్ ఫైనల్లో బల్గేరియా రెజ్లర్ బతయెవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఫైనల్ చేరిన వారికి మాత్రమే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment