ఏప్రిల్ 28 నుంచి ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ పర్యటన కోసం భారత మహిళా క్రికెట్ జట్టును నిన్న (ఏప్రిల్ 15) ప్రకటించారు. ఈ పర్యటనలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల జట్టును భారత సెలెక్టర్లు నిన్న వెల్లడించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధన వ్యవహరించనున్నారు.
ఈ సిరీస్‌కు స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ దూరంగా ఉండనుండగా.. కేరళ అమ్మాయిలు ఆశా శోభన, సజనా సజీవన్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు. శోభన 2024 డబ్ల్యూపీఎల్‌లో ఛాంపియన్ ఆర్సీబీ తరఫున సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలువగా.. సజనా గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటింది.
బంగ్లా సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో మిన్ను మణి, మన్నత్ కశ్యప్‌కు చోటు దక్కకపోగా.. డి హేమలత, రాధా యాదవ్ చాలాకాలం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా ఆడబోయే అతి పెద్ద టీ20 సిరీస్ ఇదే కావడంతో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత మహిళా క్రికెట్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దయాళన్ హేమలత, సజన సజీవన్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), యాస్తికా భాటియా (వికెట్‌కీపర్), రాధా యాదవ్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్ , ఆశా శోభనా, రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు
భారత్-బంగ్లాదేశ్ టీ20 సిరీస్ వివరాలు..
- ఏప్రిల్ 28- తొలి టీ20 (సిల్హెట్)
- ఏప్రిల్ 30- రెండో టీ20 (సిల్హెట్)
- మే 2- మూడో టీ20 (సిల్హెట్)
- మే 6- నాలుగో టీ20 (సిల్హెట్)
- మే 9- ఐదో టీ20 (సిల్హెట్)
Comments
Please login to add a commentAdd a comment