Courtesy: IPL Twitter
ముంబైపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం
ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో కేకేఆర్ మరో విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో గెలిచి లీగ్‌లో ముందడుగు వేసింది. ముంబై విధించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఓవర్‌కు 9కి తగ్గకుండా ఆద్యంతం దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ డెబ్యూ ఫిప్టీతో ఆకట్టుకోగా.. రాహుల్ త్రిపాఠి(74 నాటౌట్ , 42 బంతులు; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి వరకు నిలిచి కేకేఆర్‌కు ఘన విజయాన్ని అందించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీశాడు. తాజా విజయంతో కోల్‌కతా 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 5 ఓటములతో నాలుగో స్థానానికి చేరుకోగా.. వరుసగా రెండో ఓటమితో ముంబై ఇండియన్స్ ఆరో స్థానానికి పడిపోయింది.
అంతకముందు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆరంభంలో రోహిత్, డికాక్‌లు శుభారంభం అందించినప్పటికీ భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. అయితే డికాక్ 55 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్‌లో పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో పొలార్డ్ 21, కృనాల్ 12 పరుగులతో స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. అయితే ఆఖరి ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ముంబై నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, లోకి ఫెర్గూసన్ చెరో రెండు వికెట్లు తీశారు.
అయ్యర్ ఔట్.. త్రిపాఠి ఫిప్టీ.. విజయానికి 28 పరుగులు
ఐపీఎల్‌లో మెయిడెన్ ఫిఫ్టీ నమోదు చేసిన వెంకటేశ్ అయ్యర్ (55) బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. మరోవైపు వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి అర్థసెంచరీ పూర్తి చేసుకొని మరింత ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం కేకేఆర్ విజయానికి 28 పరుగుల దూరంలో ఉంది. త్రిపాఠి 61, ఇయాన్ మోర్గాన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ముంబైని ఉతికారేస్తున్న వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి.. 10 ఓవర్లలో 111/1
ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్ చెలరేగి ఆడుతోంది. శుబ్‌మన్ గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి వెంకటేశ్ అయ్యర్ స్కోరుబోర్డును పరుగులెత్తిస్తున్నాడు. ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 42 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు. ప్రస్తుతం కేకేఆర్ 10 ఓవర్లో వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 48, రాహుల్ త్రిపాఠి 43 పరుగులతో ఆడుతున్నారు.
శుబ్‌మన్ గిల్ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 13 పరుగులు చేసిన గిల్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే కేకేఆర్ తనన ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్‌లు దూకుడుగా కనిపించారు. ముఖ్యంగా కొత్త కుర్రాడు వెంకటేశ్ అయ్యర్ 8 బంతుల్లోనే 3 ఫోర్లు.. 2 సిక్సర్లతో 27 పరుగులతో చెలరేగాడు. ప్రస్తుతం కేకేఆర్ 3 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది.
కేకేఆర్ టార్గెట్ 156 పరుగులు
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆరంభంలో రోహిత్, డికాక్‌లు శుభారంభం అందించినప్పటికీ భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. అయితే డికాక్ 55 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్‌లో పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో పొలార్డ్ 21, కృనాల్ 12 పరుగులతో స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. అయితే ఆఖరి ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ముంబై నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, లోకి ఫెర్గూసన్ చెరో రెండు వికెట్లు తీశారు.
4వ వికెట్ కోల్పోయిన ముంబై.. 18 ఓవర్లలో 139/4
ఇషాన్ కిషన్(14) రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో రసెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లాంగాన్ దిశగా ఇషాన్ కిషన్ లాంగాన్‌లో భారీ షాట్ ఆడగా.. రసెల్ ముందుకు పరిగెడుతు అద్బుతంగా అందుకున్నాడు. ప్రస్తుతం ముంబై 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. పొలార్డ్ 20, కృనాల్ 3 పరుగులతో ఆడుతున్నారు.
ముంబై మూడో వికెట్ డౌన్.. డికాక్(55) ఔట్
వరుస బౌండరీలు, సిక్సర్లతో సూపర్ ఫిఫ్టిని సాధించిన క్వింటన్ డికాక్(42 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)ను ప్రసిధ్ కృష్ణ వెనక్కు పంపాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ ఐదో బంతికి మరో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన డికాక్.. నరైన్ చేతికి క్యాచ్ అందించి వెనుదిరిగాడు. 14.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 106/3. క్రీజ్లో ఇషాన్ కిషన్(7), పోలార్డ్ ఉన్నారు.
ముంబైకు మరో షాక్.. సూర్యకుమార్(5) ఔట్
13వ ఓవర్ తొలి బంతికే ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్లలో ఇరగదీస్తున్న సూర్యకుమార్ యాదవ్(10 బంతుల్లో 5) ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12.1 ఓవర్ల తర్వాత ముంబై స్కొర్ 89/2. క్రీజ్‌లో డికాక్(47), ఇషాన్ కిషన్ ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్(33) ఔట్
ఇన్నింగ్స్ 10వ ఓవర్ రెండో బంతికి ముంబై తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ(30 బంతుల్లో 33; 4 ఫోర్లు)ను సునీల్ నరైన్ పెవిలియన్‌కు పంపాడు. నరైన్ విసిరిన ఫ్లైయిటెడ్ బంతిని భారీ షాట్ ఆడబోయిన హిట్‌మ్యాన్.. శుభమన్ గిల్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 9.2 ఓవర్ల తర్వాత ముంబై స్కొర్ 78/1. క్రీజ్‌లో డికాక్(42), సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.
ధాటిగా ఆడుతున్న ముంబై.. 9 ఓవర్లలో 77/0
ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ రోహిత్ శర్మ, డికాక్‌లు పోటీ పడి మరీ పరగులు సాధిస్తున్నారు. ముఖ్యంగా డికాక్ వరుస బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును ఉరకలెత్తిస్తున్నాడు. ప్రస్తుతం ముంబై 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. డికాక్ 41, రోహిత్ శర్మ 33 పరుగులతో ఆడుతున్నారు.
డికాక్ మెరుపులు.. ఆరు ఓవర్లలో ముంబై స్కోరు 56/0
► కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ధాటిగా ఆడుతోంది. తొలి పవర్ ప్లే ముగిసే సమయానికి ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టడంతో ముంబై స్కోరు పరిగెత్తింది. రోహిత్ 27, డికాక్ 27 పరుగులతో ఆడుతున్నారు.
4 ఓవర్లలో ముంబై స్కోరు 29/0
► కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ నిలకడగా ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో రోహిత్ శర్మ వరుస ఫోర్లతో రెచ్చిపోయాడు. కాగా రోహిత్ శర్మ కేకేఆర్ జట్టుపై వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మరో ఓపెనర్ డికాక్ 6 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక లీగ్‌లో రెండు జట్ల ఆటతీరు పడుతూ లేస్తూ అన్న చందంగా తయారైంది. కరోనా విరామం తర్వాత మొదలైన రెండో అంచె పోటీల్లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలవ్వగా.. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ మంచి విజయాన్ని దక్కించుకుంది.
కాగా తొలి అంచె పోటీల్లో ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 152 పరుగులు చేయగా.. ఆ తర్వాత కేకేఆర్ 142 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ముఖాముఖి పోరు చూసుకుంటే ఇప్పటివరకు ఇరుజట్లు 28 మ్యాచ్‌ల్లో తలపడగా.. ముంబై 22 విజయాలు.. కేకేఆర్ 6 విజయాలు అందుకుంది. ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రాగా.. అన్‌మోల్ ప్రీత్ సింగ్‌కు చోటు దక్కలేదు. ఫిట్‌నెస్ సరిగా లేని కారణంగా హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు కూడా దూరంగా ఉన్నాడు. మరోవైపు కేకేఆర్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఇక పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ 4వ స్థానంలో ఉండగా.. కేకేఆర్ ఆరో స్థానంలో ఉంది.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్),క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సౌరభ్ తివారీ, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
కేకేఆర్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, , దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, లోకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment