ఏబీ డివిలియర్స్(ఫైల్‌ఫోటో)
చెన్నై: కనీసం ఈ ఐపీఎల్ సీజన్‌లోనైనా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆ జట్టు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను పదే పదే మార్చకుండా ఉంటే బాగుంటుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో ఆరోస్థానంలో ఉన్న ఏబీ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నాడు. అది ఏ పొజిషన్‌లో సెట్ అవుతాడో అదే ప్లేస్‌ను కంటిన్యూ చేయాలన్నాడు.
తన యూట్యూబ్ చానెల్‌లో చోప్రా మాట్లాడుతూ.. ‘ ఏబీ చాలా అరుదైన ఆటగాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆటగాడు ఏబీడీ. ఆర్సీబీకి ఇదే నా విన్నపం. నా మాట వినండి. ఏబీని కాంబినేషన్ల కోసం బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తూ కూర్చోకండి. ప్రత్యేకంగా ఫలాన సమయంలో లెగ్ స్పిన్నర్ బౌలింగ్ వస్తాడు అనే మ్యాచప్ చేసి ఏబీని బ్యాటింగ్ పంపకుండా ఉండకండి. ఒక సరైన బ్యాటింగ్ పొజిషన్ ఏబీకి ఇవ్వండి. అతను సరైన స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే ఏ మ్యాచప్‌లు పనిచేయవు. అతని బ్యాటింగ్ ఆర్డర్‌లో తప్పులు చేస్తే ఏబీ మళ్లీ గాడిలో పడటానికి సమయం ఉండదు. ఈ ఐపీఎల్‌లో ఏబీ మెరుపుల్ని చూస్తామనే అనుకుంటున్నా’ అని చోప్రా పేర్కొన్నాడు.
గత ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. శివం దూబే, వాషింగ్టన్ సుందర్‌లకు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇవ్వగా, ఏబీని కింది స్థానంలో పంపారు. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఏబీ రెండు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. కాగా, బోర్డుపై సరైన టార్గెట్ లేకపోవడం వల్లే ఆర్సీబీ పరాజయం చెందిందని విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్‌లో చివరి బంతికి కింగ్స్ పంజాబ్ గెలిచింది. చహల్ బౌలింగ్ పూరన్ సిక్స్ కొట్టి విజయాన్ని అందించాడు. ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఏప్రిల్ 9వ తేదీన చెన్నైలోని చెపాక్‌లో జరిగే ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్-14 సీజన్ ఆరంభం కానుంది.
ఇక్కడ చదవండి: మెరుపులాంటి ఫీట్‌లు.. మతిపోయే క్యాచ్‌లు
Comments
Please login to add a commentAdd a comment