
Photo Courtesy: KKR Twitter
చెన్నై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్(31; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆ జట్ట తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచినా కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. గతంలో రసెల్ క్రీజ్‌లో ఉన్నాడనే ధైర్యంగా ఉండే కేకేఆర్.. ఇప్పుడు అతని ఆటపై పూర్తి నమ్మకం ఉంచలేకపోతోంది. నిన్నటి మ్యాచ్‌లో 19 ఓవర్‌లో కేవలం ఒక్క పరుగే తీశాడు అది కూడా చివరి బంతికి సింగిల్ తీసి అతనే స్టైకింగ్ ఉంచుకున్నాడు. డబుల్స్ తీసే అవకాశం ఉన్నా రసెల్ కనీసం ప్రయత్నించకపోవడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తప్పుబట్టాడు.
ప్రస్తుతం రసెల్ శారీరక సమస్యతో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నాడని, ఎంతో విలువైన ఆటగాడు జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడకపోతే ఆ ప్రభావం చివర్లో కనిపిస్తుందని వాన్ చురకలంటించాడు. ‘ రసెల్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడని విషయం క్లియర్‌గా తెలుస్తుంది. అతని ఫిట్‌నెస్ లెవెల్స్ చాలా కిందిస్థాయిలో ఉన్నాయి. ఫీల్డింగ్ చేసేటప్పుడు వంగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. బాల్ అతని దగ్గరకు వచ్చినప్పుడు ఫీట్‌ను ఉపయోగిస్తున్నాడు. అదే సమయంలో డబుల్స్ తీసే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఆండ్రీ రసెల్ వంటి సూపర్ స్టార్ ఇలా అన్‌ఫిట్‌గా ఉండటం ఆ జట్టుకు సరికొత్త తలనొప్పే. ఇలా అయితే కెప్టెన్ మోర్గాన్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌లకు జట్టును ముందుకు తీసుకెళ్లడం కష్టంగా మారడం ఖాయం’ అని వాన్ అభిప్రాయపడ్డాడు.
ఆరంభంలో శిఖర్ ధవన్(92) మెరుపులకు, ఆఖర్లో స్టోయినిస్(13 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సుడిగాలి ఇన్నింగ్స్ తోడవ్వడంతో మరో 10 బంతులు మిగిలుండగానే ఢిల్లీ జట్టు సునాయాస విజయాన్ని సాధించింది. పంజాబ్ నిర్ధేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (36 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు.
ఇక్కడ చదవండి: పదే పదే బౌల్డ్ కావడంతో ఏమీ అర్థంకాని పరిస్థితి
14.25 కోట్లు: క్రేజీ అనుకున్నా.. కానీ తప్పని నిరూపించాడు!
సిరాజ్ మొత్తం మారిపోయాడు: కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment