Photo Courtesy: PTI
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని.. చాలామంది యువ క్రికెటర్లకు ఆదర్శం. ధోనితో మాట్లాడే అవకాశం వస్తే యువ క్రికెటర్ల ఆనందానికి హద్దులు ఉండవు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పేసర్ సకారియా కూడా అదే జోష్‌లో ఉన్నాడు. ధోనిని కలిసి, అతనితో ముచ్చటించినందుకు సంతోషంలో మునిగితేలుతున్నాడు సకారియా. ఐపీఎల్-2021లో భాగంగా సోమవారం రాజస్థాన్ రాయల్స్-సీఎస్‌కే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే సకారియాతో ధోని కాసేపు గడిపాడు. అనంతరం సకారియా కోరిక మేరకు అతనితో కలిసి ఓ ఫోటో దిగాడు. ఆ ఫోటోను సకారియా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.
‘నా చిన్నతనం నుంచి ధోని అంటే నాకు స్ఫూర్తి. నాకు ధోనితో కలిసి ఆడే అవకాశం వచ్చింది. ఇది నా జీవితంలో మరచిపోలేని అనుభూతి. ఎప్పటికీ నాతో ఉండిపోయే జ్ఞాపకం. మీ కెరీర్ అంతా మాకు ఆదర్శంగా నిలుస్తూనే ఉన్నావు’ అని రాసుకొచ్చాడు. దీనిపై ధోనిపై ప్రశంసల కురుస్తోంది. యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో యువ క్రికెటర్ షారుక్‌ఖాన్‌ను ధోని కలిశాడు. షారుక్‌కు ఆట గురించి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు.
ఇదిలా ఉంచితే, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఐపీఎల్‌లో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. వాంఖెడే స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని సీఎస్‌కే 45 పరుగుల ఆధిక్యంతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేయగా, రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులకే పరిమితమై ఓడిపోయింది.
ఇక్కడ చదవండి: నాకు ఎలా ఆడాలో తెలుసు..ఆంక్షలు ఏంటి? సామ్సన్
90 నిమిషాల్లో వెళ్లాలి.. లేకపోతే కోహ్లికి ఫైన్..!
Comments
Please login to add a commentAdd a comment