Rishabh Pant Breaks Virender Sehwag Record: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్, ఢిల్లీ ఫ్రాంఛైజీ మాజీ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో ఢిల్లీ ఫ్రాంఛైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వీరూ.. ఢిల్లీ డేర్‌డెవిల్స్(గతంలో ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున 85 ఇన్నింగ్స్‌లో 2382 పరుగులు చేయగా.. నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగులు చేయడం ద్వారా పంత్ అతని రికార్డును అధిగమించాడు.
పంత్ ఢిల్లీ తరఫున 75 ఇన్నింగ్స్‌ల్లో 2390 పరుగులు చేసి సెహ్వాగ్‌ను వెనక్కి నెట్టాడు. పంత్ ఖాతాలో ఒక సెంచరీ, 14 హాఫ్ సెంచరీలుండగా, సెహ్వాగ్ ఓ సెంచరీ, 17 హాఫ్ సెంచరీలు చేశాడు. చాలాకాలంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ తరఫున అత్యధిక పరుగుల రికార్డు సెహ్వాగ్ పేరిటే ఉండింది. తాజాగా పంత్.. సెహ్వాగ్ రికార్డును తిరగరాశాడు. వీరిద్దరి తర్వాత ఢిల్లీ తరఫున అత్యధిక పరుగుల రికార్డు శ్రేయస్ అయ్యర్ పేరిట ఉంది. అయ్యర్.. 82 ఇన్నింగ్స్‌ల్లో 2291 పరుగులు చేశాడు.
చదవండి: కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది ఆ ముగ్గురేనా..?
Comments
Please login to add a commentAdd a comment