
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతోంది. కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లను కొనసాగించడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కరోనా విలయంతో దేశమంతా భీతావహ పరిస్థితులు నెలకొనివుండటంతో ఇప్పుడు ఈ టోర్నమెంట్ కొనసాగించడం అవసరమా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
ఒక పక్క కరోనాతో జనం చస్తుంటే ఐపీఎల్‌ను ఆపకుండా కొనసాగించడం ఎంత వరకు సమంజసమని అడగుతున్నారు. అయితే దేశాన్ని వణికిస్తున్న ఉపద్రవం నుంచి ప్రజల దృష్టిని మళ్లించి కాస్త ఉపశమనం కలిగించేందుకు ఐపీఎల్ దోహదం చేస్తుందని అంటున్నావారూ లేకపోలేదు. ఐపీఎల్ కొనసాగించడంపై మరి మీరేమంటారు?
Comments
Please login to add a commentAdd a comment