Photo Couurtesy: IPL/Twitter
ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తాను హిట్టింగ్ చేయడానికి తమ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇచ్చిన సలహానే ప్రధాన కారణమని ఆ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రివీల్ చేశాడు. ధోని నాన్ స్టైకర్ ఎండ్‌లో ఉన్న సమయంలో హర్హల్ బౌలింగ్ ఎలా పడుతుంది అని అంచనా వేసి తనకో సలహా ఇచ్చాడని, అదే ఆఖరి ఓవర్‌లో తాను హిట్టింగ్ చేయడానికి ఉపయోగపడిందన్నాడు. మ్యా,చ్ తర్వాత అవార్డుల కార్యక్రమంలో జడేజా మాట్లాడుతూ.. హర్షల్ పటేల్ బౌలింగ్ గురించి ధోని తనతో చర్చించాడన్నాడు.
‘మీకు ఇంతకంటే మంచి రోజు ఎప్పుడైనా వచ్చిందా’ అని జడేజాను అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘ లేదు.. దాని గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా జట్టుకు నా సహకారాన్ని ఏదైతే అందించానో దాన్ని ఎంజాయ్ చేస్తున్నా. మ్యాచ్ విజయంలో నా పాత్ర ఉన్నందుకు ఆనందంగా ఉంది. కొంతకాలంగా నా ఫిట్‌నెస్, సిల్స్‌ను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టా. అది ఈ రోజు ఉపయోగపడింది. ఒక ఆల్‌రౌండర్‌గా నిరూపించుకోవడం చాలా కష్టం. నువ్వు ప్రతీ విభాగంలోనూ నీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. ట్రైనింగ్ సెషన్‌లో కూడా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్‌ను ఒకే రోజు చేయడం చాలా కష్టం’ అని జడేజా తెలిపాడు.
ధోని ముందే చెప్పాడు..
హర్షల్ పటేల్ బౌలింగ్ ఆఖరి ఓవర్ చేస్తున్నప్పుడు నాన్ స్టైకర్ ఎండ్‌లో ఉన్నప్పుడు నాతో ఒక విషయం చెప్పాడు. హర్షల్ ఆవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బౌలింగ్ వేసే అవకాశం ఉంది. చూసుకో అని చెప్పాడు. దానికి నేను సిద్ధం అని ధోని భాయ్‌తో చెప్పా.. అదృష్టం కొద్దీ అదే ఉపయోగపడింది. ప్రతీ బంతి కనెక్ట్ అయ్యింది. 191 పరుగులు చేయకలిగాం. నాకు తెలుసు.. నేను స్టైకింగ్ ఎండ్‌లో ఉన్నప్పుడు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనుకున్నా’ అని జడేజా తెలిపాడు.
ఇక్కడ చదవండి: ఐపీఎల్ 2021: వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చు..
మీ విదేశీ ఆటగాళ్లను ఇవ్వండి: ఆర్‌ఆర్ రిక్వెస్ట్
Comments
Please login to add a commentAdd a comment