ప్రియమైన శ్రీమతికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు: వార్నర్‌ | IPL 2021: Warner Wishes Wife Candice On Their Marriage Anniversary | Sakshi
Sakshi News home page

భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వార్నర్‌

Published Sun, Apr 4 2021 5:05 PM | Last Updated on Sun, Apr 4 2021 8:28 PM

IPL 2021: Warner Wishes Wife Candice On Their Marriage Anniversary - Sakshi

చెన్నై: ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారధి డేవిడ్‌ వార్నర్‌.. ఆదివారం తన భార్య క్యాండీస్‌ వార్నర్‌కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ఏప్రిల్‌ 4న తమ ఆరో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య  క్యాండీస్‌ చేతిపై ముద్దుపెట్టుకుంటున్న ఫొటోను వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. "6 సంవత్సరాల బలమైన బంధం, నా ప్రియమైన శ్రీమతికి వార్షికోత్సవ శుభాకాంక్షలు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా" అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. భర్త పోస్ట్‌పై భార్య క్యాండీస్‌ స్పందిస్తూ.. "మన ప్రయాణంలో ఆరేళ్లు హాయిగా గడిచిపోయాయి, మన బంధం జీవితకాలం ఇలాగే సాగిపోవాలని కోరుకుంటూ.. నా ప్రియమైన భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు" అంటూ ఇన్‌స్టాలో పేర్కొంది. కాగా, వార్నర్‌ భారత్‌కు బయలుదేరేముందు కూడా తన భార్యను మిస్సవుతానంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. అందులో "తన డార్లింగ్‌తో(భార్య) చివరి పెగ్‌" అంటూ భార్య క్యాండీస్‌పై ప్రేమను ఒలకబోసాడు. 

ఇదిలా ఉండగా, మరో ఐదు రోజుల్లో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 14వ సీజన్‌ కోసం అన్ని జట్లు తమ సన్నాహకాలను మొదలుపెట్టాయి. ఆయా జట్ల ఆటగాళ్లు ఇప్పటికే తమ ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసిన హోటల్స్‌కు చేరుకున్నారు. సన్‌రైజర్స్‌ సారధి డేవిడ్‌ వార్నర్‌, స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ శుక్రవారమే చెన్నై చేరుకున్నారు. వీరు ప్రస్తుతం యాజమాన్యం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఏప్రిల్‌ 11న చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. 
చదవండి: నా డార్లింగ్‌తో చివరి పెగ్‌: వార్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement