Photo Courtesy: Twitter
అహ్మదాబాద్: కరోనా వైరస్ తాకిడి విస్తృతంగా ఉన్న నేపథ్యంలో భారత్ నుంచి విమాన రాకపోకలను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిలిపివేయడంతో ఐపీఎల్ ఆడుతున్న ఆ దేశ క్రికెటర్ల పరిస్థితి సందిగ్థంలో పడింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత విదేశీ క్రికెటర్లను స్వదేశాలకు పంపించే బాధ్యత తమదేనని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) హామీ ఇచ్చినా ఈ విషయంలో ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఎక్కడో లోలోపల భయంగానే ఉంది. ప్రత్యేక విమానాలను ఆసీస్ క్రికెటర్ల కోసం వేయబోమని ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ ఇప్పటికే కుండ బద్ధలు కొట్టారు. వారి వెళ్లింది ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం కాదని, వ్యక్తిగతంగానే వెళ్లినప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం చార్టర్ విమానాలు వేసే ప్రసక్తే ఉండదన్నారు. ఎలాగైతే సొంత ఖర్చులతో వెళ్లారో అలానే స్వదేశానికి రావాలని తేల్చిచెప్పారు.
ఈ క్రమంలోనే బీసీసీఐ దీనిపై కసరత్తు చేస్తున్నా ఆసీస్ క్రికెటర్లు కూడా దానికి తగ్గ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ యూకేలో జరుగనున్న తరుణంలో ఇంగ్లండ్, భారత క్రికెటర్లతో కలిసి అక్కడికి వెళితే బాగుంటుందని ఆస్ట్రేలియాకు చెందిన మ్యాక్స్‌వెల్ భావిస్తున్నాడు. అలా కానీ పక్షంలో సుదీర్ఘకాలం భారత్‌లో ఉండాల్సిన పరిస్థితులు రావొచ్చని, భారత క్రికెటర్లతో కలిసి ఆసీస్ క్రికెటర్లంతా ముందుగా యూకే చేరుకుంటే బాగుంటుందని మ్యాక్సీ ఆలోచన. ఇంగ్లండ్‌కు వెళితేనే తాము అనుకున్న సమయానికి స్వదేశానికి చేరతామని ‘ద ఫైనల్ వర్డ్ పాడ్‌కాస్ట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మ్యాక్సీ సూచాయగా వెల్లడించాడు.
కాగా, జూన్ 18 నుంచి 22 వరకు జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు టీమిండియా కూడా ఇంగ్లండ్ వెళ్లనుంది. సౌతాంప్టన్ వేదికగా డబ్యూటీసీ ఫైనల్ జరుగనుంది. భారత్‌ను రెడ్‌లిస్ట్‌లో పెట్టినా ఈ మెగా ఫైనల్ జరిపి తీరుతామని ఐసీసీ ప్రకటించిన నేపథ్యంలో న్యూజిలాండ్-భారత్‌లు ముందస్తు షెడ్యూల్ ప్రకారం సౌతాంప్టన్ చేరుకుంటాయి.
ఇక్కడ చదవండి: పుల్ షాట్ మాస్టర్‌కు హ్యాపీ బర్త్‌డే..!
వైరల్: పృథ్వీ షాపై పగ తీర్చుకున్న శివం మావి!
Comments
Please login to add a commentAdd a comment