Photo Courtesy:RCB Twitter
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంపై ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. ఇది నిజంగా సమిష్టి విజయమని పేర్కొన్న కోహ్లి.. తమకు ఇదొక టాప్ గేమ్‌గా నిలిచిపోతుందన్నాడు. తమ జట్టును చూస్తే గర్వంగా ఉందన్నాడు. మ్యాచ్ తర్వాత అవార్డుల కార్యక్రమంలో కోహ్లి మాట్లాడుతూ.. తమకున్న బౌలింగ్ వనరుల్ని సరైన సమయంలో వినియోగించుకుని విజయం సాధించామన్నాడు. ‘‘మాకు చాలా బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. మేము అదనంగా ఉపయోగించిన బౌలింగ్ ఆప్షన్లు అనేవి మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపాయి. మా వాళ్లకి నేను ఒక్కటే చెప్పా.. 149 పరుగుల స్కోరును చాలా ఇబ్బందిపడి సాధించామని అనుకోవద్దని చెప్పా.
ఈ పిచ్ పరిస్థితి అలా ఉంది కాబట్టి మా స్కోరుపై మాకు నమ్మకం ఉంది. మాకు బ్యాటింగ్ కష్టమైతే, వాళ్లకు కూడా కష్టంగానే ఉంటుంది కదా. ఎప్పుడైనా ఛేజింగ్ అనేది ఒత్తిడితోనే ఉంటుంది. వికెట్లు పడితే ఒత్తిడిలోకి వెళతారు. అదే ఫాలో అయ్యాం. ఈ వికెట్ అంత మెరుగ్గా లేదు. బంతి పాత బడేకొద్దీ వికెట్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. అంతకుముందు ముంబై ఇండియన్స్-కేకేఆర్ మ్యాచ్‌లో కూడా జరిగింది అదే. నేను పవర్ ప్లేలో బౌండరీలు కొట్టాలనే యత్నం చేశారు. మా ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్సే చాలా కీలకమైంది. ఈ విజయాలతో మేమేమీ పొంగి పోవడం లేదు. మా ప్రణాళికలతో ముందుకెళతాం. మేము హర్షల్ పటేల్‌ను ఢిల్లీ వద్ద నుంచి ట్రేడింగ్ ద్వారా తీసుకున్నాం. మా విజయాల్లో హర్షల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు’’ అని కోహ్లి తెలిపాడు.
ఇక్కడ చదవండి: ఐపీఎల్ 2021: ఒత్తిడిలో సన్‌రైజర్స్ చిత్తు
Comments
Please login to add a commentAdd a comment