Breadcrumb
CSK VS SRH: అభిషేక్, త్రిపాఠి మెరుపులు.. బోణీ కొట్టిన సన్‌రైజర్స్
Published Sat, Apr 9 2022 3:07 PM | Last Updated on Sat, Apr 9 2022 7:15 PM
Live Updates
IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ లైవ్ అప్డేట్స్
బోణీ కొట్టిన సన్‌రైజర్స్.. సీఎస్కేకు వరుసగా నాలుగో ఓటమి
ఐపీఎల్ 2022 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ (75), రాహుల్ త్రిపాఠి (39 నాటౌట్) రెచ్చిపోయి ఆడారు. ఫలితంగా ఎస్ఆర్హెచ్ మరో 14 బంతులు ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ విలియమ్సన్ 32 పరుగులతో పర్వాలేదనిపించగా, సీఎస్కే బౌలర్లలో బ్రావో, ముఖేశ్ చౌదరీలకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే సీజన్లో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది.
తొలి గెలుపు పక్కా చేసి ఔటైన అభిషేక్ శర్మ
50 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసిన అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లి ఔటయ్యాడు. మ్యాచ్‌ను తొందరగా ముగించాలని భారీ షాట్ ఆడబోయిన అభిషేక్.. బ్రావో బౌలింగ్‌లో జోర్డాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ తొలి గెలుపుకు కేవలం 10 పరుగుల దూరంలో ఉంది. క్రీజ్‌లో రాహుల్ త్రిపాఠి (14 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్ ఉన్నారు.
అభిషేక్ హాఫ్ సెంచరీ.. తొలి విజయం దిశగా ఎస్ఆర్హెచ్
ఐపీఎల్ 2022 సీజన్లో ఎస్ఆర్హెచ్ ఎట్టకేలకు తొలి విజయం దిశగా సాగుతుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (35 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో జట్టును విజయం దిశగా తీసుకెళ్తున్నాడు. మరో ఎండ్‌లో రాహుల్ త్రిపాఠి (3 బంతుల్లో 7; సిక్స్) భారీ షాట్లు ఆడుతున్నాడు. 13 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 97/1గా ఉంది. హైదరాబాద్ విజయానికి 42 బంతుల్లో 58 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.
కేన్ విలియమ్సన్(32) ఔట్.. ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్
32 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్ ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 56 పరుగులతో ఆడుతున్నాడు.
ఎస్ఆర్హెచ్ నిలకడ.. 9 ఓవర్లలో 62/0
సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తోంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 39, విలియమ్సన్ 23 పరుగులతో ఆడుతున్నారు.
జిడ్డు బ్యాటింగ్‌తో విసిగిస్తున్న కేన్ మామ.. 4 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ ఎంతంటే..?
155 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్.. నిదానంగా బ్యాటింగ్ చేస్తుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18 బంతుల్లో 8; ఫోర్) జిడ్డు బ్యాటింగ్‌తో విసుగు తెప్పిస్తుండగా, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (12 బంతుల్లో 16; 2ఫోర్లు) ఆచితూచి ఆడుతున్నాడు. 5 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు మాత్రమే చేసింది.
ఆఖర్లో జడ్డూ మెరుపులు.. గౌరవప్రదమైన స్కోర్ సాధించిన సీఎస్కే
వన్‌డౌన్ బ్యాటర్ మొయిన్ అలీ (48), ఆఖర్లో కెప్టెన్ జడేజా (23) మెరుపుల సాయంతో ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్కు ఫైటింగ్ టార్గెట్‌ను నిర్ధేశించగలిగింది. మొయిన్ అలీ, జడేజాలతో పాటు రాయుడు (27), రుతరాజ్(16), ఉతప్ప (15) రెండంకెల స్కోర్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో నటరాజన్, సుందర్ చెరో 2 వికెట్లు.. జన్సెన్, భువనేశ్వర్ కుమార్, మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు.
భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటైన జడేజా
భువనేశ్వర్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్లో భారీ షాట్‌కు ప్రత్నించిన జడేజా (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్) కేన్ విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
నిరాశపర్చిన ధోని
తొలి మ్యాచ్‌లో అజేయమైన అర్ధశతకం బాది ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించిన ధోని.. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతున్నాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 6 బంతులను ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన ఈ సీఎస్కే మాజీ సారధి.. జన్సెన్ బౌలింగ్‌లో ఉమ్రాన్ మాలిక్‌కు సునాయసమైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 125/6. క్రీజ్‌లో జడేజా (12), బ్రావో ఉన్నారు.
5 బంతుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయిన సీఎస్కే
స్కోర్ వేగం పెంచే క్రమంలో సీఎస్కే వరుసగా వికెట్లు కోల్పోతుంది. భారీ షాట్లు ఆడుతూ జోరుమీదున్నట్లు కనిపించిన మొయిన్ అలీ (35 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ని మార్క్రమ్ బోల్తా కొట్టించగా, మరో 3 బంతుల్లోనే శివమ్ దూబే (5 బంతుల్లో 3)ను నటరాజన్ అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపాడు. 16 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 113/5. క్రీజ్‌లో ధోని (2), జడేజా (2) ఉన్నారు.
రాయుడు ఔట్
స్కోర్ వేగం పెంచే క్రమంలో అంబటి రాయుడు (27 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి రాయుడు పెవిలియన్ బాట పట్టాడు. 13.3 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 99/3. క్రీజ్‌లో మొయిన్ అలీ (40), శివమ్ దూబే ఉన్నారు.
గేర్ మార్చిన మొయిన్ అలీ
ఆరంభంలో వరుసగా వికెట్లు పడటంతో ఆచితూచి ఆడిన మొయిన్ అలీ (29 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్) ఆ తర్వాత క్రమంగా వేగం పెంచాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డు వేగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 13వ ఓవర్లో ఫోర్, సిక్సర్ బాదిన మొయిన్ 13 పరుగులు పిండుకున్నాడు. మరో ఎండ్‌లో రాయుడు (25 బంతుల్లో 27; 4 ఫోర్లు) నిదానంగా ఆడుతున్నాడు. 13 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 97/2గా ఉంది.
ఆచితూచి ఆడుతున్న మొయిన్ అలీ, రాయుడు
36 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సీఎస్కేను మొయిన్ అలీ (17 బంతుల్లో 19; 2 ఫోర్లు), అంబటి రాయుడు (13 బంతుల్లో 13; 2 ఫోర్లు) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నారు. 9 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 63/2గా ఉంది.
నట్టూ సూపర్ యార్కర్.. మరోసారి విఫలమైన రుతురాజ్
యార్కర్ల కింగ్ నటరాజన్ అద్భుతమైన బంతితో రుతురాజ్ (13 బంతుల్లో 16; 3 ఫోర్లు)ను బోల్తా కొట్టించాడు. నట్టూ వేసిన పర్ఫెక్ట్ ఇన్ స్వింగింగ్ యార్కర్‌కు రుతురాజ్ క్లీన్ బౌల్డయ్యాడు. 5.1 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 36/2. క్రీజ్‌లో మొయిన్ అలీ (5), అంబటి రాయుడు ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే
టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 4వ ఓవర్ తొలి బంతికే రాబిన్ ఉతప్ప (11 బంతుల్లో 15; ఫోర్) ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి ఉతప్ప పెవిలియన్‌కు చేరాడు. 4 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 32/1. క్రీజ్‌లో రుతురాజ్ (16), మొయిన్ అలీ (1) ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 9) మరో ఆసక్తికర పోరు జరుగనుంది. ప్రస్తుత సీజన్లో విజయం కోసం ముఖం వాచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్లు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా (కెప్టెన్), ధోని (వికెట్ కీపర్), రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, మహీశ్ తీక్షణ, క్రిస్ జోర్డాన్, ముఖేష్ చౌదరి
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్
Related News By Category
Related News By Tags
-
పరుగు తేడాతో శతకం చేజార్చుకున్న రుతురాజ్.. సచిన్ రికార్డు సమం
CSK VS SRH: పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో జరుగుతున్న సమరంలో సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), డెవాన్ కాన్వే (55 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫో...
-
IPL 2022: ఎట్టకేలకు హైదరాబాద్ గెలుపు బోణీ
ముంబై: ఐపీఎల్–2022లో రెండు వరస ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి విజయం దక్కింది. తమలాగే గెలుపు రుచి చూడని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి రైజర్స్ పాయింట్ల ఖాతా తెరిచింది. శనివారం జరిగిన ప...
-
బోణీ విజయం కోసం తహతహలాడుతున్న ఎస్ఆర్హెచ్, సీఎస్కే.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..?
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 9) మరో ఆసక్తికర పోరు జరుగనుంది. ప్రస్తుత సీజన్లో విజయం కోసం ముఖం వాచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్లు ముంబైలో...
-
IPL 2024: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపునకు వచ్చినా టాప్-4 బెర్తులపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. మిగ...
-
అలా అయితేనే ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్.. ఆ రెండు జట్లు కన్ఫామ్!?
చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తర్వాత ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కింగ్స్ టాప్-4 రేసు నుంచి నిష్క్రమించగా....
Comments
Please login to add a commentAdd a comment