Dhoni Stormed Onto Field Over No Ball Decision Same As Rishabh Pant: రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్‌లో నో బాల్ విషయంలో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన ఓవరాక్షన్‌పై సర్వత్రా చర్చ నడుస్తుంది. ఈ మ్యాచ్‌లో పంత్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటు ఫీల్డ్‌లో ఉన్న ఆటగాళ్లను రీకాల్ చేసి తగిన మూల్యమే చెల్లించుకున్నాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంగన కింద పంత్‌కు 100 శాతం జరిమానా పడింది. ఈ మొత్తం వ్యవహారంలో పంత్‌కు మద్దతుగా నిలిచిన శార్ధూల్ ఠాకూర్, అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేలపై కూడా ఐపీఎల్ యాజమాన్యం కొరడా ఝలిపించింది. శార్దూల్ ఠాకూర్‌కు 50 శాతం జరిమానా, మ్యాచ్ మధ్యలో ఫీల్డ్‌లోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు గాను ప్రవీణ్ ఆమ్రేకు 100 శాతం జరిమానా (దీనికి అదనంగా ఓ మ్యాచ్ నిషేధం) విధించింది.
When MS Dhoni lost his cool https://t.co/9GjQ7hJWtt via @ipl
— Naresh kumar Pradhan (@iam_naresh7) April 11, 2019
ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాటి సీఎస్‌కే కెప్టెన్ ధోని కూడా నో బాల్ విషయంలో పంత్‌లానే అతి చేశాడు. సీఎస్‌కే గెలుపుకు 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో బౌలర్ నడుం కంటే ఎత్తులో ఫుల్ టాస్ బంతిని సంధించాడు. దీన్ని ఫీల్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించకపోవడంతో డగౌట్‌లో ఉన్న ధోని కోపంతో ఊగిపోయాడు. గ్రౌండ్‌లోకి వచ్చి రచ్చరచ్చ చేయడంతో పాటు అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
ఈ మ్యాచ్‌లో ధోని సేన ఎలాగోలా గట్టెక్కినప్పటికీ ధోని ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే నాడు ఐపీఎల్ యాజమాన్యం ధోని విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కేవలం 50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో సరిపెట్టింది. నాడు ధోని విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన ఐపీఎల్ యజమాన్యం పంత్ ఇష్యూని సీరియస్‌గా తీసుకుంది. 100 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు అంతర్గత సమావేశంలో పంత్ విషయమై పెద్ద చర్చే నడిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంత్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ధోనికో లెక్క.. పంత్‌కో లెక్కా..? అంటూ ఐపీఎల్ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. నాడు ధోని మైదానంలోకి దూసుకొచ్చినా పట్టించుకోని మేనేజ్‌మెంట్.. పంత్ విషయాన్ని హైలైట్ చేసిందంటూ మండిపడుతున్నారు.
చదవండి: నో బాల్ రాద్ధాంతం.. పంత్, శార్దూల్‌లకు భారీ షాక్.. ఆమ్రేపై నిషేధం
Comments
Please login to add a commentAdd a comment