Gujarat Titans Jersey 2022: Gujarat Titans Launch Their Jersey Ahead Of Debut Season - Sakshi
Sakshi News home page

IPL 2022 Gujarat Titans Jersey: గుజరాత్‌ టైటాన్స్‌ జెర్సీ ఆవిష్కరణ.. సర్‌ప్రైజ్‌కు సిద్ధంగా ఉండాలన్న కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా

Published Mon, Mar 14 2022 7:40 AM | Last Updated on Mon, Mar 14 2022 1:42 PM

IPL 2022: Gujarat Titans Launch Their Jersey Ahead Of Debut - Sakshi

గుజరాత్‌ టైటాన్స్‌ ధరించబోయే జెర్సీతో టీమ్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(PC: Gujarat Titans)

IPL 2022- Gujarat Titans- Hardik Pandya Says It Would Be Surprise- ఐపీఎల్‌ కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ తమ జెర్సీని ఆవిష్కరించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, హెడ్‌కోచ్‌ ఆశిష్‌ నెహ్రా, బీసీసీఐ కార్యదర్శి జై షా.. జట్టు ఇతర అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించింది. కాగా ఐపీఎల్‌-2022 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో పాటు అహ్మదాబాద్‌కు చెందిన గుజరాత్‌ టైటాన్స్‌ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మార్చి 28న ఇరు కొత్త జట్ల మధ్య తొలిమ్యాచ్‌ జరుగనుంది. ఇక జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడాడు. ఈ సందర్భంగా బౌలింగ్‌ చేస్తారా లేదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘సర్‌.. అది సర్‌ప్రైజ్‌.. సర్‌ప్రైజ్‌లాగే ఉండనివ్వండి’’ అంటూ సమాధానం దాటవేశాడు.

అదే విధంగా కెప్టెన్సీ గురించి చెబుతూ.. ‘‘విజయాలు జట్టువి.. అపజయాలు నావి. జట్టులోని ఆటగాళ్లకు స్వేచ్చను ఇచ్చి.. వారి ప్రతిభను ఉపయోగించుకోవడమే ముఖ్యం. ఈ విషయంలో పూర్తి స్పష్టత, నిజాయితీతో ఉండాలి. అంతా బాగున్న సమయంలో వారికి మన మద్దతు అవసరం లేదు.

కష్ట సమయాల్లో మాత్రం వెన్నుతట్టి ప్రోత్సహించినపుడే మంచి ఫలితాలు రాబట్టగలం. అంతా కెప్టెన్‌ మీదే ఆధారపడి ఉంటుంది’’ అని హార్దిక్‌ చెప్పుకొచ్చాడు. కాగా గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్‌ పాండ్యాను మెగా వేలానికి ముందే 15 కోట్లు చెల్లించి గుజరాత్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement