
ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్న రెండు జట్టలో ఒకటైన గుజరాత్ టైటాన్స్ ఎట్టకేలకు తమ ఫ్రాంచైజీ లోగోను అధికారికంగా విడుదల చేసింది. టైటాన్స్ యాజమాన్యం ఆదివారం మెటావర్స్‌లో లోగోను ఆవిష్కరించింది. ఇందులో జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, కీలక ఆటగాడు శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా దర్శనమిచ్చారు. దీన్ని గుజరాత్ టైటాన్స్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
🏃🏃♀️Step into the Titans Dugout! ▶️ Watch our stars unveil the logo in the metaverse! ⭐ ▶️ https://t.co/dCcIzWpM4U#GujaratTitans pic.twitter.com/9N6Cl6a3y4
— Gujarat Titans (@gujarat_titans) February 20, 2022
సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ సంస్థ సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా, ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్‌గా, గ్యారీ కిర్‌స్టన్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. వేలానికి ముందు హార్ధిక్‌తో పాటు రషీద్ ఖాన్(15 కోట్లు), శుభ్‌మన్ గిల్(8 కోట్లు)లను డ్రాఫ్టెడ్ ప్లేయర్లుగా ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్.. వేలంలో మరో 52 కోట్లు ఖర్చు చేసి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఫెర్గూసన్ (10 కోట్లు), జేసన్ రాయ్ (2 కోట్లు), డేవిడ్ మిల్లర్ (3 కోట్లు), మాథ్యూ వేడ్ (2.4 కోట్లు), రాహుల్ తెవాతియా (9 కోట్లు) లాంటి విధ్వంసకర వీరులకు గుజరాత్ టైటాన్స్ రికార్డు ధర చెల్లించింది.
రిటైన్డ్ ఆటగాళ్లు:
హార్ధిక్ పాండ్యా(15 కోట్లు)
రషీద్ ఖాన్(15 కోట్లు)
శుభ్‌మన్ గిల్(8 కోట్లు)
మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
లోకి ఫెర్గూసన్ (10 కోట్లు)
రాహుల్ తెవాతియా (9 కోట్లు)
మహ్మద్ షమీ (6.25 కోట్లు)
యశ్ దయాల్ (3.2 కోట్లు)
ఆర్ సాయ్ కిషోర్ (3 కోట్లు)
డేవిడ్ మిల్లర్ (3 కోట్లు)
అభినవ్ సదరంగని (2.6 కోట్లు)
మాథ్యూ వేడ్ (2.4 కోట్లు)
అల్జరీ జోసఫ్ (2.4 కోట్లు)
జేసన్ రాయ్ (2 కోట్లు)
వృద్ధిమాన్ సాహా (1.9 కోట్లు)
జయంత్ యాదవ్ (1.70 కోట్లు)
విజయ్ శంకర్ (1.40 కోట్లు)
డామినిక్ డ్రేక్స్ (1.10 కోట్లు)
గురుకీరత్ సింగ్ (50 లక్షలు)
వరుణ్ ఆరోన్ (50 లక్షలు)
నూర్ అహ్మద్ (30 లక్షలు)
దర్శన్ నల్ఖండే (20 లక్షలు)
ప్రదీప్ సాంగ్వాన్ (20 లక్షలు)
సాయి సుదర్శన్ (20 లక్షలు)
చదవండి: ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన పుజారా.. టీ20 తరహాలో..!
Comments
Please login to add a commentAdd a comment