IPL 2022 KKR Vs DC And RR Vs LSG Highlights: Kuldeep Yadav Kuldeep Sen Magical Performance - Sakshi
Sakshi News home page

IPL 2022: కుల్దీప్‌.. కుల్దీప్‌.. అదరగొట్టారుగా! ఇద్దరూ సూపర్‌!

Published Mon, Apr 11 2022 10:25 AM | Last Updated on Mon, Apr 11 2022 3:21 PM

IPL 2022 KKR Vs DC And RR Vs LSG: Kuldeep Yadav Kuldeep Sen Magical - Sakshi

కుల్దీప్‌ యాదవ్‌, కుల్దీప్‌ సేన్‌(PC: IPL/BCCI)

IPL 2022 KKR Vs DC And RR Vs LSG- Kuldeep Yadav Kuldeep Sen Magicals- కుల్దీప్‌ యాదవ్‌.. కుల్దీప్‌ సేన్‌.. వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్దరు బౌలర్లు ఆదివారం నాటి ఐపీఎల్‌ మ్యాచ్‌లలో హైలెట్‌గా నిలిచారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్‌ కీలకంగా వ్యవహరిస్తే.. లక్నో సూపర్‌జెయింట్స్‌పై రాజస్తాన్‌ గెలుపులో కుల్దీప్‌ సేన్‌ తన వంతు పాత్ర పోషించాడు. 

ఈ క్రమంలో వీరిద్దరిపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒకే పేరున్న ఈ ఇద్దరు బౌలర్లు తమ తమ జట్ల విజయాల్లో కీలకంగా మారడం నిజంగా ఆసక్తికర విషయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే.. బాగా ఆడారు అంటూ కొనియాడుతున్నారు.

కాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు ఓవర్లలో 35 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను అవుట్‌ చేసి కేకేఆర్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఆ తర్వాత మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఇక కుల్దీప్‌ సేన్‌ విషయానికొస్తే.. లక్నోతో మ్యాచ్‌లో ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్‌ వేశాడు.  అప్పటికి లక్నో గెలుపునకు 15 పరుగులు అవసరం. అలాంటి సమయంలో రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ బంతిని కుల్దీప్‌నకు ఇచ్చాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కుల్దీప్‌ సేన్‌ వైవిధ్యమైన బంతులతో స్టొయినిస్‌ను ఇబ్బంది పెట్టాడు. కుల్దీప్‌ వేసిన తొలి బంతికి అవేశ్‌ ఖాన్‌ సింగిల్‌ తీశాడు.

తర్వాతి మూడు బంతుల్లో స్టొయినిస్‌ పరుగు కూడా చేయలేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో లక్నో విజయానికి ఆఖరి 2 బంతుల్లో 14 అవసరమయ్యాయి. ఈ రెండు బంతుల్లో స్టొయినిస్ ఫోర్‌, సిక్సర్‌తో చెలరేగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. దీంతో 3 పరుగుల తేడాతో విజయం రాజస్తాన్‌ సొంతమైంది. ఇక ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ సేన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

చదవండి: IPL 2022: అతడికి అవకాశాలు రాలేదు.. మేము అండగా నిలబడ్డాం: పంత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement