Courtesy: IPL Twitter
Breadcrumb
IPL 2022: ఎస్ఆర్హెచ్పై కోల్‌కతా ఘన విజయం
Published Sat, May 14 2022 6:49 PM | Last Updated on Sat, May 14 2022 11:22 PM
Live Updates
IPL 2022: కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ లైవ్ అప్డేట్స్
ఎస్ఆర్హెచ్పై కోల్‌కతా ఘన విజయం
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓటమి చెందింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(43), మాక్రమ్(32) పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచారు.
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రస్సెల్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సామ్ బిల్లింగ్స్ 34, అజింక్య రహానే 28 పరుగులతో రాణించారు.
ఆరో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్
107 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఐదో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్
99 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన మార్క్రమ్.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 101/5
నాలుగో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్
ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన పూరన్.. నరైన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ నాలుగు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది.
మూడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్
72 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన రాహుల్ త్రిపాఠి
54 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. సౌథీ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 57/2
తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్
178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన విలియమ్సన్.. రస్సెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ స్కోర్: 31/1
4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 27/0
4 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్(7), అభిషేక్ శర్మ(20) పరుగులతో ఉన్నారు.
రస్సెల్ మెరుపులు.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 178 పరుగులు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రస్సెల్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సామ్ బిల్లింగ్స్ 34, అజింక్య రహానే 28 పరుగులతో రాణించారు.
ఆరో వికెట్ కోల్పోయిన కేకేఆర్..
157 పరుగుల వద్ద కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన సామ్ బిల్లింగ్స్.. విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
17 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 142/5
17 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. క్రీజులో రస్సెల్(26), సామ్ బిల్లింగ్స్(26) పరుగులతో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్
83 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. మాలిక్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠికు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు,
మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్
72 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన రహానే.. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో శశాంక్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(11), సామ్ బిల్లింగ్స్(2) పరుగులతో ఉన్నారు. 9 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 78/3
రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్
65 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన నితీష్ రాణా.. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
6 ఓవర్లకుకేకేఆర్ స్కోర్: 55/1
6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజ్‌లో నితీష్ రాణా(24), అజింక్యా రహానే(20) పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
17 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్.. జానెసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 17/1
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్
ఐపీఎల్-2022లో భాగంగా ఎంసీఏ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కీలకపోరుకు ఎస్ఆర్హెచ్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
కేకేఆర్
వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్(వికెట్ కీపర్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి
ఎస్ఆర్హెచ్
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
Related News By Category
Related News By Tags
-
'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత జట్టులో చూడాలనుకుంటున్నాం'
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లో 71 పరుగులు సాధించి ఎస్ఆర్హెచ్ విజయంలో క...
-
ఐపీఎల్లో ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా!
ఐపీఎల్లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక జట్లకు ప్రాతినిధ్యం వహించిన తొలి ఆటగాడిగా ఫించ్ నిలిచాడు. ఐపీఎల్-2022లో భాగంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో క...
-
రూ. 6.5 కోట్లే దండగ.. మళ్లీ వైస్ కెప్టెన్సీనా!?
ఐపీఎల్లో ఎవరికి అర్థం కాని జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది అంతుచిక్కదు. డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తప్పించడం నుంచి మొదలు...
-
మమ్మల్ని గర్వపడేలా చేశారు.. అందరికి ధన్యవాదాలు: కావ్య మారన్
ఐపీఎల్-2024 సీజన్ రన్నరప్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలకమైన ఫైనల్లో మాత్రం చేతులేత్తేసింది. చెపాక్ వేదికగా కోల...
-
కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
కోల్కత్తా: ఐపీఎల్-17(2024)లో విజేతగా నిలిచిన కోల్కత్తా నైట్‌రైడర్ జట్టును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డులు బద్దలు కొట్టినందుకు ప్లేయర్స్‌కు వ్యక...
Comments
Please login to add a commentAdd a comment