BJP MP Gautam Gambhir Corona Positive: టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ఆయన మంగళవారం వెల్లడించారు. ఈ మేరకు... ‘‘స్వల్ప లక్షణాలతో బాధ పడుతున్న నేను కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకోగా ఈరోజు పాజిటివ్‌గా తేలింది. నాతో సన్నిహితంగా మెలిగిన వాళ్లంతా దయచేసి టెస్టులు చేయించుకోండి’’అని గంభీర్ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిస్తున్నారు.
After experiencing mild symptoms, I tested positive for COVID today. Requesting everyone who came into my contact to get themselves tested. #StaySafe
— Gautam Gambhir (@GautamGambhir) January 25, 2022
కాగా క్రికెట్ కామెంటేటర్‌గా, ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గంభీర్.. ఐపీఎల్-2022 సీజన్‌తో క్యాష్ రిచ్‌లీగ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఆయన మెంటార్‌గా వ్యవహరించనున్నారు. ఇక కేఎల్ రాహుల్‌తో పాటు మార్కస్ స్టొయినిస్, రవి బిష్ణోయిలను ఈ ఫ్రాంఛైజీ ఎంపిక చేసుకుంది. రాహుల్ సారథిగా పగ్గాలు చేపట్టనున్నాడు.
ఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ... ‘‘రాహుల్ కేవలం బ్యాటర్‌గానే కాదు... నాయకుడిగానూ అద్భుతంగా రాణించగలడు. ఓపెనింగ్ చేయగలడు. వికెట్ కీపింగ్ చేయగలడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన నిలకడ గల ఆటతో ఇప్పటికే నిరూపించుకున్నాడు. పంజాబ్‌తో పాటు ఇతర జట్లకు ఆడిన అపార అనుభవం రాహుల్ సొంతం. తన వల్ల జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది’’ అని రాహుల్‌పై ప్రశంసలు కురిపించారు.
Catch our team owner, Dr. Sanjiv Goenka and Captain @klrahul11
— Lucknow Super Giants (@LucknowIPL) January 25, 2022
in conversation with @vikrantgupta73! 🙌@sports_tak @aajtak #LucknowSuperGiants #IPL https://t.co/o84W2l2ljU
Comments
Please login to add a commentAdd a comment