ముంబై: లక్నో విజయ సమీకరణం 12 బంతుల్లో 34 పరుగులు. అంటే ఇంకో 2 ఓవర్లలో మ్యాచ్ ముగియనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ బోణీ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. కానీ కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్ ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వలేదు. 19వ ఓవర్‌ను శివమ్ దూబేతో వేయించిన చెన్నై ఎత్తుగడ చిత్తయింది. రెండు వైడ్లతో సహా 8 బంతులేసిన దూబే ఏకంగా 25 పరుగులిచ్చాడు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎవిన్ లూయీస్ (23 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూపర్ షాట్లతో విజయాన్ని ఖాయం చేశాడు. 6 బంతుల్లో 9 పరుగుల సులువైన సమీకరణంగా మార్చేశాడు. ఆయుష్ బదోని (9 బంతుల్లో 19 నాటౌట్; 2 సిక్స్‌లు) భారీ సిక్సర్‌తో ఇంకా మూడు బంతులు మిగిలుండగానే లక్నో గెలిచింది. గురువారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో సూపర్‌జెయింట్స్ 6 వికెట్ల తేడాతో సూపర్‌కింగ్స్‌ను ఓడించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీస్కోరు చేసింది. రాబిన్ ఉతప్ప (27 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్), శివమ్ దూబే (30 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిపించారు. అనంతరం కొండంత లక్ష్యాన్ని లక్నో ‘ఆఖరి మెరుపులతో’ అనూహ్యంగా ఛేదించింది. సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి నెగ్గింది. డికాక్ (45 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్ రాహుల్ (26 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.
రాబిన్ ‘పవర్’ప్లే
చెన్నై స్కోరుకు, జోరుకు కారణం ఓపెనర్ రాబిన్ ఉతప్ప! మెరుపులతో గట్టి పునాది వేసిన ఈ హిట్టర్ తో పాటు అలీ కూడా భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో పవర్‌ప్లే (6 ఓవర్లు)లో చెన్నై 73/1 స్కోరు చేసింది. దూబే వచ్చీ రాగానే దంచేసే పనిలో పడ్డాడు. అంబటి రాయుడు (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చకచకా పరుగులు సాధించాడు.
చెలరేగిన డికాక్, రాహుల్
లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్ జోరుతో 4.5 ఓవర్లోనే సూపర్‌జెయింట్స్ స్కోరు 50కి చేరింది. 10 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ కోల్పోకుండా 90 పరుగులు చేసింది. డికాక్ (34 బంతుల్లో; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించిన తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరగా... లూయీస్ భారీ షాట్లతో విరుచుపడ్డాడు. దీపక్ హుడా (13) నిలువలేకపోయినా... బదోనితో కలిసి జట్టును గెలిపించాడు. 23 బంతుల్లోనే అతను అర్ధ సెంచరీ చేయడం విశేషం.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 50; రుతురాజ్ రనౌట్ 1; అలీ (బి) అవేశ్ 35; దూబే (సి) లూయిస్ (బి) అవేశ్ 49; రాయుడు (బి) బిష్ణోయ్ 27; జడేజా (సి) మనీశ్ (బి) టై 17; ధోని నాటౌట్ 16; ప్రిటోరియస్ (ఎల్బీ) (బి) టై 0; బ్రేవో నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 210.
వికెట్ల పతనం: 1–28, 2–84, 3–106, 4–166, 5–189, 6–203, 7–203.
బౌలింగ్: అవేశ్ 4–0–38–2, చమీర 4–0–49–0, టై 4–0–40–2, కృనాల్ 3–0–36–0, రవి బిష్ణోయ్ 4–0–24–2, హుడా 1–0–12–0.
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) రాయుడు (బి) ప్రిటోరియస్ 40; డికాక్ (సి) ధోని (బి) ప్రిటోరియస్ 61; మనీశ్ పాండే (సి) బ్రేవో (బి) తుషార్ 5; లూయిస్ నాటౌట్ 55; హుడా (సి) జడేజా (బి) బ్రేవో 13; బదోని నాటౌట్ 19; ఎక్స్‌ట్రా లు 18; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 211.
వికెట్ల పతనం: 1–99, 2–106, 3–139, 4–171.
బౌలింగ్: ముకేశ్ 3.3–0–39–0, తుషార్ 4–0–40–1, బ్రేవో 4–0–35–1, జడేజా 2–0–21–0, అలీ 1–0–14–0, ప్రిటోరియస్ 4–0–31–2, దూబే 1–0–25–0.
ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా నైట్‌రైడర్స్ఠ్ X పంజాబ్ కింగ్స్
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచిస్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👌 👌
— IndianPremierLeague (@IPL) March 31, 2022
A mighty batting performance from @LucknowIPL to seal their maiden IPL victory. 👏 👏 #TATAIPL | #LSGvCSK
Scorecard ▶️ https://t.co/uEhq27KiBB pic.twitter.com/amLhbG4w1L
Comments
Please login to add a commentAdd a comment