If Gujarat Titans Reach Final Might Get Chance To Play T20 WC: భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గత కొంతకాలంగా టీమిండియా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక గిల్ ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. గత సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ పంజాబీ ఆటగాడు 58 మ్యాచ్‌లు ఆడాడు. 17 ఇన్నింగ్స్‌లో 478 పరుగులు సాధించాడు.
అయితే, మెగా వేలం-2022 నేపథ్యంలో కేకేఆర్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. గిల్‌ను రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. దీంతో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్(అహ్మదాబాద్) గిల్‌ను సొంతం చేసుకుంది. వేలానికి ముందు జరిగిన ముగ్గురు ఆటగాళ్ల ఎంపికలో భాగంగా 7 కోట్లు వెచ్చించి అతడిని దక్కించుకుంది.
మరోవైపు.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరితే తాను వరల్డ్‌కప్ టోర్నీ భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
ఈ మేరకు అతడు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఓ ఆటగాడిగా గుజరాత్ టైటాన్స్ కోసం నేనేం చేయగలనో అన్నీ చేస్తాను. జట్టుగా, వ్యక్తిగతంగా మేం రాణించాలి. ఒకవేళ మేము ప్లే ఆఫ్స్.. ఆ తర్వాత ఫైనల్ చేరినట్లయితే.. రానున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆడే భారత జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇక కేకేఆర్‌తో తన అనుబంధం గురించి శుభ్‌మన్ గిల్ చెబుతూ.. ‘‘కేకేఆర్‌తోనే నా ఐపీఎల్ కెరీర్ ఆరంభమైంది. 2018లో ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. ఓపెనర్‌గా వెళ్లాను. నంబర్ 4 ప్లేస్లో కూడా బ్యాటింగ్ చేశా. ఆ మరుసటి ఏడాది ఏడో స్థానంలో.. ఆ తర్వాత సంవత్సరం టాపార్డర్‌కు ప్రమోట్ అయ్యాను. ఇలా వివిధ పాత్రలు పోషించాను. గత సీజన్‌లో గాయం కారణంగా ఇబ్బందులు పడ్డా. తొలి దశలో మాకు అస్సలు కలిసిరాలేదు. అయితే ఆ తర్వాత వరుస విజయాలతో ఫైనల్ చేరడం సంతోషాన్నిచ్చింది’’ అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022- Punjab Kings: సిక్సర్లు ఎలా కొట్టాలంటే... చెబుతా.. నేను ఉన్నది అందుకేగా!
To new beginnings 🏏 @gujarat_titans pic.twitter.com/yLM708uSvL
— Shubman Gill (@ShubmanGill) February 9, 2022
Comments
Please login to add a commentAdd a comment