IPL 2023: GT final over thriller win against CSK - Sakshi
Sakshi News home page

GT Vs CSK: అదీ లెక్క.. ఫైనల్‌ ఓవర్లోనే! తొమ్మిదింట 8 ఇలాగే! హార్దిక్‌ వల్లేనన్న రషీద్‌!

Published Sat, Apr 1 2023 10:36 AM | Last Updated on Sat, Apr 1 2023 11:56 AM

IPL 2023 GT Vs CSK: Final Over Thriller GT Win Record Rashid Thanks To - Sakshi

గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Photo Credit: IPL/BCCI)

Gujarat Titans vs Chennai Super Kings: ఐపీఎల్‌-2023 ఆరంభ మ్యాచ్‌లో డిపెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ అదరగొట్టింది. అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్‌ గెలిచిన హార్దిక్‌ సేన.. నాలుగుసార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు తాజా సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే ఓటమిని రుచి చూపించింది. సొంత మైదానంలో ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో సత్తా చాటింది. 

గిల్‌(63) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు ఆఖర్లో రషీద్‌ ఖాన్‌ మెరుపులతో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం అందుకుంది. కాగా ఐపీఎల్‌-2022తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్‌కు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌పై వరుసగా ఇది మూడో గెలుపు.

ఈ క్రమంలో ధోని నేతృత్వంలోని సీఎస్‌కే పేరిట చెత్త గణాంకాలు నమోదయ్యాయి. ఒక జట్టుతో ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో ఓడిన టీమ్‌గా నిలిచింది. 2008లో రాజస్తాన్‌ రాయల్స్‌, 2022-23 సీజన్‌(ఇప్పటి వరకు)లో గుజరాత్‌ చేతిలో ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది. హ్యాట్రిక్‌ పరాజయాలు నమోదు చేసింది.

ఛేజింగ్‌లో తొమ్మిదింట 8 ఇలాగే
మరోవైపు.. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ టోర్నీలో ఇప్పటి వరకు 10 సార్లు ఛేజింగ్‌ చేయగా.. తొమ్మిదింట విజయాలు సాధించింది. అందులో ఎనిమిది ఆఖరి ఓవర్లోనే రావడం విశేషం. గత సీజన్‌లో రాహుల్‌ తెవాటియా.. తాజా మ్యాచ్‌లో అతడితో కలిసి వైస్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ అదిరిపోయే ఫినిషింగ్‌తో జట్టుకు గెలుపు అందించారు. 

మా కెప్టెన్‌ హార్దిక్‌ వల్లే: రషీద్‌ ఖాన్‌
ఈ నేపథ్యంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రషీద్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘‘తొలి మ్యాచ్‌లోనే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. టోర్నీ ఆసాంతం నాకు ఇది మంచి బూస్ట్‌ ఇస్తుంది. మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమంగా రాణించేందుకు కృషి చేస్తున్నా. నెట్స్‌లో బ్యాటింగ్‌ ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయడం కలిసి వచ్చింది.

నేను బ్యాటింగ్‌ చేయగలనని కెప్టెన్‌ హార్దిక్‌, మా కోచింగ్‌ స్టాఫ్‌ నాలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేశారు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌.. మొయిన్‌ అలీ(23)బెన్ స్టోక్స్‌ (7) రూపంలో కీలక వికెట్లు దక్కించుకున్నాడు. అదే విధంగా 3 బంతుల్లో ఒక సిక్సర్‌, ఓ ఫోర్‌ సాయంతో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఐపీఎల్‌- 2023: గుజరాత్‌ వర్సెస్‌ చెన్నై మ్యాచ్‌ స్కోర్లు
టాస్‌: గుజరాత్‌- బౌలింగ్‌
చెన్నై- 178/7 (20)
గుజరాత్‌ 182/5 (19.2)

చదవండి: GT Vs CSK: చెన్నై పేసర్‌ అరుదైన ఘనత.. టోర్నీ చరిత్రలోనే మొదటిసారి ఇలా! గుజరాత్‌ కూడా..
IPL 2023- MS Dhoni: మా ఓటమికి కారణం అదే: ధోని! కొంపముంచిన ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement