గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా- చెన్నై సారథి ధోని (PC: IPL/BCCI)
IPL 2023 GT Vs CSK- Opening Day- న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించి అటు టీవీలో, ఇటు డిజిటల్ వేదికపైనా కొత్త రికార్డులు నమోదయ్యాయి. చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌ను వేర్వేరు దశల్లో కలిపి స్టార్ టీవీలో 140 మిలియన్ల మంది ప్రేక్షకులు కూడా చూశారని డిస్నీ స్టార్ సంస్థ ప్రకటించింది. మొత్తంగా 8.7 బిలియన్ నిమిషాల పాటు అభిమానులు స్టార్ స్పోర్ట్స్‌లో లీగ్ తొలి పోరును ఆస్వాదించారని ఆ సంస్థ పేర్కొంది.
గత ఏడాదితో పోలిస్తే ఇది 47 శాతం ఎక్కువ కాగా, మొత్తంగా రేటింగ్స్ కూడా 29 శాతం పెరగడం విశేషం. మరో వైపు ‘జియో సినిమా’లో ఫ్యాన్స్ కూడా ఐపీఎల్‌పైనే దృష్టి పెట్టారు. వారాంతంలో అభిమానుల ఆసక్తిని గమనిస్తే ఒక్కో మ్యాచ్‌ను ఒక్కో ప్రేక్షకుడు కనీసం 57 నిమిషాల పాటు డిజిటల్ వేదికపై చూశారని వయాకామ్ 18 స్పోర్ట్స్ ప్రకటించింది.
గత ఏడాది ఐపీఎల్ మొత్తం సీజన్‌ను డిజిటల్‌లో చూసినదాంతో పోలిస్తే ఈ ఒక్క వారాంతంలోనే దానికి మించిన గణాంకాలు నమోదయ్యాయని వెల్లడించింది. అభిమానులు జియో సినిమాలో మొత్తం 147 కోట్ల వీడియోలు చూడగా... ఏకంగా 5 కోట్ల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం.
చదవండి: వరుసగా రెండు సిక్సర్లు.. ఐపీఎల్‌లో ధోని అరుదైన రికార్డు
ఈ మాత్రం ఆటకి 16 కోట్లు దండగ! ఒక్క సిక్సర్ కూడా లేదు! సెట్ కాడు
Comments
Please login to add a commentAdd a comment