ధోని (PC: CSK)
IPL 2023- MS Dhoni Practice Video: చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్, టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్-2023కి సన్నద్ధమవుతున్నాడు. ఇందుకోసం ఇప్పటికే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. నెట్స్‌లో బౌలర్లను ఎదుర్కొంటూ మిస్టర్ కూల్ తనదైన శైలిలో షాట్లతో అలరిస్తున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్‌కే ఇన్‌స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ‘‘మహీ భాయ్ వచ్చేస్తున్నాడు. ఐదో ట్రోఫీని గెలిచి తీరతాడు. ఆ క్షణం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
గతేడాది వైఫల్యం
మార్చి 31 నుంచి మే 28 వరకు ఐపీఎల్-2023 జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు సీఎస్‌కేకు నాలుగు ట్రోఫీలు అందించి.. విజయవంతమైన కెప్టెన్‌గా మిస్టర్ కూల్ ఖ్యాతిగాంచాడు.
అయితే, గతేడాది డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను సారథిగా నియమించి భారీ మూల్యం చెల్లించుకుంది. కెప్టెన్సీ భారాన్ని భరించలేని జడ్డూ మధ్యలోనే పగ్గాలు వదిలేయగా.. మళ్లీ ధోని ఆ బాధ్యతను తలకెత్తుకున్నాడు.
తన వారసుడిగా జడేజా రాణిస్తాడనుకున్న తలాకు ఇలా ఊహించని పరిణామం ఎదురుకావడంతో తానే మళ్లీ కెప్టెన్సీ చేపట్టాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం పోయింది. పద్నాలుగింట కేవలం 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
అరంగేట్రంలోనే గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ గెలవగా.. మాజీ చాంపియన్ చెన్నై మాత్రం అవమానకరరీతిలో నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఆటగాడిగా ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ అన్న వార్తల నేపథ్యంలో ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఐదోసారి జట్టును చాంపియన్‌గా నిలపాలని కోరుకుంటున్నారు. మరోవైపు.. ఈసారి వేలంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌ను కొనుగోలు చేసిన సీఎస్‌కే.. ధోని సూచన మేరకు అతడిని సీఎస్‌కే సారథిగా నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు:
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సిమ్ పజేతిరి, సిమ్ పజేతిరి చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ.
ఐపీఎల్-2023 మినీ వేలంలో కొన్న ఆటగాళ్లు:
అజింక్యా రహానే (50 లక్షలు), బెన్ స్టోక్స్ ( 16.25 కోట్లు), షేక్ రషీద్ ( 20 లక్షలు), నిశాంత్ సింధు ( 60 లక్షలు), కైల్ జేమిసన్ ( 1 కోటి), అజయ్ మండల్ ( 20 లక్షలు), భగత్ వర్మ ( 20 లక్షలు).
చదవండి: టీమిండియాలో చోటు కోసం దూసుకొస్తున్న మరో యువ కెరటం.. డెబ్యూలోనే డబుల్ సెంచరీ, సెంచరీ
IND vs AUS: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు.. భరత్‌కు నో ఛాన్స్! కిషన్ అరంగేట్రం
Ind Vs Aus: ఇండోర్ పిచ్ పరమ చెత్తగా ఉంది.. అతడు లేడు కాబట్టే ఇలా: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment