CSK Vs LSG: ఐపీఎల్‌లో నేడు మరో ఆసక్తికర సమరం | IPL 2024: CSK To Take On LSG Today, Check Head To Head Records And Predicted Playing XI - Sakshi
Sakshi News home page

IPL 2024 CSK Vs LSG: ఐపీఎల్‌లో నేడు మరో ఆసక్తికర సమరం

Published Tue, Apr 23 2024 9:03 AM | Last Updated on Tue, Apr 23 2024 9:26 AM

IPL 2024: Chennai Super Kings To Take On Lucknow Super Giants Today At Chidambaram Stadium - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 23) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఐదు సార్లు ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను  లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఢీకొట్టనుంది. చెన్నై హోం గ్రౌండ్‌ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. 

ప్రస్తుత సీజన్‌లో చెన్నై 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. లక్నో సైతం 7 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. సీఎస్‌కేతో పోలిస్తే లక్నో రన్‌రేట్‌ కాస్త తక్కువగా ఉంది. 

హెడ్‌ టు హెడ్‌ రికార్డుల విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో సీఎస్‌కే ఒకటి, లక్నో రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఐపీఎల్‌లో దాదాపు అన్ని జట్లపై మెరుగైన రికార్డు ఉన్న సీఎస్‌కే లక్నో విషయంలో కాస్త వెనుకపడి ఉంది. 

బలాబలాల విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ఇరు జట్ల బలాబలాలు సమానంగా ఉన్నాయి. అన్ని విభాగాల్లో సీఎస్‌కే, లక్నో సమతూకంగా ఉన్నాయి. సీఎస్‌కేతో పోలిస్తే లక్నోలో బ్యాటింగ్‌ డెప్త్‌ కాస్త ఎక్కువగా ఉంది. ఈ జట్టు నిండా విధ్వంసకర వీరులే ఉన్నారు. సీఎస్‌కేలో చెప్పుకోదగ్గ హిట్టర్లు లేనప్పటికీ ఆ జట్టులో కచ్చితత్వం ఉంది. అందరూ కలిసికట్టుగా ఆడతారు.

బౌలింగ్‌ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో సీఎస్‌కేకు బౌలింగే బలం. పేసర్లు పతిరణ, ముస్తాఫిజుర్‌, తుషార్‌ దేశ్‌పాండే అద్భుతంగా రాణిస్తున్నారు. జడేజా,మొయిన్‌ అలీ తమ స్థానాలకు న్యాయం చేస్తున్నారు.

లక్నో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సంచలన పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ జట్టుకు దూరమైనప్పటి (గాయం) నుంచి లక్నో పేస్‌ విభాగం బలహీనపడింది. యశ్‌ ఠాకూర్‌, మొహిసిన్‌ ఖాన్‌ అడపాదడపా రాణిస్తున్నారు. కొత్తగా జట్టులోకి వచ్చిన మ్యాట్‌ హెన్రీపై లక్నో భారీ ఆశలు పెట్టుకుంది. రవి బిష్ణోయ్‌ తేలిపోతుండటం లక్నోను మరింత కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

తుది జట్లు (అంచనా)..
లక్నో: కేఎల్‌ రాహుల్, క్వింటన్ డికాక్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, మ్యాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్ [ఇంపాక్ట్‌ ప్లేయర్‌: దేవదత్ పడిక్కల్]

సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని, దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరణ [ఇంపాక్ట్‌ ప్లేయర్‌: తుషార్ దేశ్‌పాండే]
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement