PC:IPL.com
ఐపీఎల్-2024లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి తిరిగి పుంజుకున్న ముంబై ఇండియన్స్.. మళ్లీ పాత పంథానే ఎంచుకుంది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది.
207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ ఆజేయ శతకంతో చెలరేగినప్పటికి ఓటమి నుంచి మాత్రం తన జట్టును గట్టెక్కించ లేకపోయాడు.
Dhoni Scored 20 runs . CSK won by 20 Runs . What a Player ❤️ pic.twitter.com/RfKO5h0jkR
— MAHIYANK™ (@Mahiyank_78) April 14, 2024
కొంపముంచిన ధోని..
ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆడిన ఇన్నింగ్సే ముంబై ఇండియన్స్ కొంపముంచింది. సీఎస్‌కే బ్యాటింగ్ సందర్భంగా ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని మెరుపులు మెరిపించాడు. కేవలం 4 బంతుల్లోనే 3 సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేసిన ధోని.. తమ జట్టు స్కోర్ 200 పరుగులు దాటడంలో కీలక పాత్ర పోషించాడు.
Dhoni Scored 20 Runs
— Office Of Chaudhary Rohit Singh Yadav (@OfficeOfCRSY) April 14, 2024
CSK won by 20 Runs
What a Player 💛
Thala Score 20 Runs
CSK won by 20 Runs #CSKvsMI #MIvsCSK pic.twitter.com/nUVVJ97DAa
అయితే సరిగ్గా ధోని చేసిన ఆ 20 పరుగులే ముంబై ఓటమికి, సీఎస్‌కే విజయానికి కారణమయ్యాయి. దీంతో 20 రన్స్ అనే కీవర్డ్ ఎక్స్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్ దూబే(66 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(69) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. . ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు, కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలా వికెట్ సాధించారు.
Those 20 runs made all the difference..🔥#CSKvsMI pic.twitter.com/JfzFaOwpyF
— CSK (Less active) (@CSK_myspace) April 14, 2024
Comments
Please login to add a commentAdd a comment