IPL 2024 RR vs PBKS Live Updates:
ఉత్కంఠపోరులో రాజస్తాన్ విజయం
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ మరో అద్బుత విజయాన్ని నమోదు చేసింది. ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 3 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఆఖరి ఓవర్‌లో రాజస్తాన్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. హెట్‌మైర్ రెండు సిక్స్‌లు బాది తన జట్టును గెలిపించాడు. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెట్‌మైర్(27), పరాగ్(23) పరుగులతో రాణించారు.
పంజాబ్ బ్యాటర్లలో రబాడ, అర్ష్‌దీప్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్, బ్రార్ తలా వికెట్ సాధించాఇరు. అంతకముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆశుతోష్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
19 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్ 138/7
19 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. 6 బంతుల్లో రాజస్తాన్ విజయానికి 10 పరుగులు కావాలి.
రాజస్తాన్ నాలుగో వికెట్ డౌట్.. పరాగ్ ఔట్
113 పరుగుల వద్ద రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రాజస్తాన్ విజయానికి 18 బంతుల్లో 34 పరుగులు కావాలి.
మూడో వికెట్ డౌన్.. శాంసన్ ఔట్
89 పరుగుల వద్ద రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన శాంసన్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ధ్రువ్ జురెల్ వచ్చాడు.
రెండో వికెట్ డౌన్..
82 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రియాన్ పరాగ్ వచ్చాడు.
11 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 79/1
11 ఓవర్లకు రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(37), సంజూ శాంసన్(15) పరుగులతో ఉన్నారు.
రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..
56 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన తనీష్ కోటియన్.. లివింగ్ స్టోన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ శాంసన్ వచ్చాడు.
7 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 49/0
148 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ నిలకడగా ఆడుతోంది. 7 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 49/0. క్రీజులో జైశ్వాల్(28), కోటియన్(20) పరుగులతో ఉన్నారు.
అశుతోష్ మెరుపు ఇన్నింగ్స్.. రాజస్తాన్ టార్గెట్ 148 పరుగులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ కాస్త తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆశుతోష్ శర్మ మరోసారి ఆదుకున్నాడు. ఆఖరిలో ఆశుతోష్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ ఆ మాత్రం స్కోరైనా సాధించగల్గింది.
ఆశుతోష్ 16 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 31 పరుగులు చేశాడు. అతడితో పాటు జితేష్ శర్మ(29) పరుగులతో రాణించాడు. రాజస్తాన్ బౌలర్లలో కేశవ్ మహారాజ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ సేన్, చాహల్, బౌల్ట్ తలా వికెట్ సాధించారు.
పంజాబ్ ఆరో వికెట్ డౌన్.. జితేష్ ఔట్
103 పరుగుల వద్ద పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జితేష్ శర్మ.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
16 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 103/5
16 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో జితేష్ శర్మ(29), లివింగ్ స్టోన్(14) పరుగులతో ఉన్నారు.
పంజాబ్ ఐదో వికెట్ డౌన్..
70 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన శశాంక్ సింగ్.. కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 72/5
53 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో పంజాబ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 53 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 6 పరుగులు చేసిన స్టాండింగ్ కెప్టెన్ సామ్ కుర్రాన్.. మహారాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 53/4
పంజాబ్ మూడో వికెట్ డౌన్.. బెయిర్ స్టో ఔట్
47 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి జితేష్ శర్మ వచ్చాడు.
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్..
41 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్.. చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 42/2
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్..
28 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అథర్వ తైదే అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
3 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 26/0
3 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో అథర్వ తైదే(15), జానీ బెయిర్ స్టో(8) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా ముల్నాపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పంజాబ్ రెగ్యూలర్ కెప్టెన్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో సామ్ కుర్రాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, అథర్వ టైడే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ
రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, తనుష్ కొటియన్, కేశవ్ మహరాజ్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్
Comments
Please login to add a commentAdd a comment