2024 ఐపీఎల్ సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ తమ కొత్త కెప్టెన్ పేరును అధికారికంగా ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ వచ్చే సీజన్ నుంచి టైటాన్స్‌ను ముందుండి నడిపిస్తాడని ఫ్రాంచైజీ యాజమాన్యం వెల్లడించింది. గత రెండు సీజన్లలో గిల్ తమ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడని, బ్యాటర్‌గానే కాకుండా అన్ని విషయాల్లో పరిణతి సాధించాడని ఫ్రాంచైజీ డైరెక్టర్ విక్రమ్ సోలంకీ అన్నాడు. గిల్ సహకారంతో టైటాన్స్ ఐపీఎల్‌లో బలీయమైన శక్తిగా ఎదిగిందని అతను పేర్కొన్నాడు. గిల్ లాంటి యువ నాయకుడితో కొత్త ప్రయాణం ప్రారంభించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు.
𝐂𝐀𝐏𝐓𝐀𝐈𝐍 𝐆𝐈𝐋𝐋 🫡#AavaDe pic.twitter.com/tCizo2Wt2b
— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023
కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై గిల్ స్పందిస్తూ.. టైటాన్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపాడు. టైటాన్స్ సారధ్య బాధ్యతలు లభించినందుకు గర్విస్తున్నాని అన్నాడు. తనపై నమ్మకం ఉంచి కెప్టెన్సీ బాధ్యతను అప్పజెప్పినందుకు ఫ్రాంచైజీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపాడు. చక్కటి జట్టును నడిపించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. టైటాన్స్‌తో గత రెండు సీజన్ల ప్రయాణం అద్భుతంగా సాగిందని, మున్ముందు కూడా ఇదే కొనసాగించాలని భావిస్తున్నానని తెలిపాడు. నాణ్యమైన క్రికెట్‌తో జట్టును నడిపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు.
కాగా, నిన్న (నవంబర్ 26) చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల్లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడిండ్ చేసుకున్న విషయం తెలిసిందే. హార్దిక్ నాయకత్వంలో టైటాన్స్ 2022 సీజన్‌లో విజేతగా, 2023 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ రెండు సీజన్లలో గిల్ టైటాన్స్ తరఫున అద్భుతంగా రాణించాడు. గత సీజన్‌లో అతను 3 సెంచరీలు బాది లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్సీ రేసులో గిల్‌తో పాటు కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ కూడా పోటీపడినప్పటికీ గుజరాత్ యాజమాన్యం గిల్‌వైపే మొగ్గుచూపింది.
Comments
Please login to add a commentAdd a comment