
జితేశ్ శర్మ- ప్యాట్ కమిన్స్ (PC: SRH X)
ఐపీఎల్-2024 లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ దంచికొట్టింది. సన్‌రైజర్స్ హైదారాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించింది. టాపార్డర్ రాణించడంతో సన్‌రైజర్స్‌కు 215 పరుగుల లక్ష్యం విధించగలిగింది.
కాగా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచిన పంజాబ్ కింగ్స్.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న సన్‌రైజర్స్‌తో పోటీకి దిగింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ క్రమంలో ఓపెనర్లు అథర్వ టైడే(27 బంతుల్లో 46), ప్రభ్‌సిమ్రన్ సింగ్(45 బంతుల్లో 71), వన్‌డౌన్ బ్యాటర్ రిలీ రోసో(24 బంతుల్లో 49) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. అదే విధంగా వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ కెప్టెన్ (15 బంతుల్లో 32 నాటౌట్) ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
ఈ క్రమంలో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించింది. ఇక సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్‌కు రెండు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, విజయకాంత్ వియస్కాంత్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ప్లే ఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్.. పంజాబ్‌తో మ్యాచ్‌లో గనుక గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే, కేకేఆర్- రాజస్తాన్ మధ్య మ్యాచ్ ఫలితం తర్వాతే రెండో స్థానం ఖరారవుతుందో లేదో తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment