ఐపీఎల్ 2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సూపర్ ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ బ్యాటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేశారు. ఫలితంగా సన్‌రైజర్స్ 162 పరుగులకే పరిమితమైంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17, క్లాసెన్ 24, షాబాజ్ అహ్మద్ 22, అబ్దుల్ సమద్ 29, వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యారు.
After two consecutive powerhouse performances, the Sunrisers Hyderabad have failed to replicate their high-scoring form against Gujarat Titans. pic.twitter.com/9zBSWI9sXK
— CricTracker (@Cricketracker) March 31, 2024
గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా బౌలింగ్ చేసి జోరు మీదుండిన సన్‌రైజర్స్‌కు అడ్డుకట్ట వేశారు. మోహిత్ శర్మ 3, ఒమర్‌జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో 200 పరుగుల మార్కును క్రాస్ చేసిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో నామమాత్రపు స్కోర్‌కు పరిమితం కావడంతో ఆ జట్టు అభిమానులు నిరాశ చెందారు. అహ్మదాబాద్ పిచ్ చాలా స్లోగా కనిపిస్తుంది. సన్‌రైజర్స్ బౌలర్లకు కూడా ఇది కలిసొస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment