ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ విధ్వంసం సృష్టించాడు. ఆఖరిలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అభిషేక్.. పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా పంజాబ్ పేసర్ హర్షల్ పటేల్‌కు అయితే అభిషేక్ చుక్కలు చూపించాడు.
ఆఖరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌ల్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదిన పోరెల్ ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. మరో పరుగు సింగిల్ రూపంలో వచ్చింది. ఓవరాల్‌గా 10 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 4 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 32 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఎవరీ అభిషేక్ పోరెల్?
21 ఏళ్ల అభిషేక్ పోరెల్ పశ్చిమ బెంగాల్‌లోని చందన్‌నగర్‌లో జన్మించాడు. దేశీవాళీ క్రికెట్‌లో బెంగాల్ జట్టుకు అభిషేక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2022లో బరోడాతో జరిగిన మ్యాచ్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అభిషేక్ అడుగుపెట్టాడు. పోరెల్‌కు బ్యాటింగ్‌తో పాటు అద్బుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పటివరకు 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 1072 పరుగులు చేశాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో పోరెల్ వికెట్ కీపర్‌గా 58 క్యాచ్‌లు, 8 స్టంపౌట్‌లలో భాగమయ్యాడు.
ఇక 2022 ఏడాది లోనే లిస్ట్-ఏ క్రికెట్‌లో పోరెల్ అడుగుపెట్టాడు. తన లిస్ట్-ఏ కెరీర్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన పోరెల్.. 275 పరుగులు చేశాడు. కాగా టీ20ల్లో మంచి రికార్డు ఉంది. ఆఖరిలో వచ్చి మెరుపులు మెరిపించడం పోరెల్ స్పెషల్. ఇప్పటివరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడిన పోరెల్.. 228 పరుగులు చేశాడు. దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు రిషబ్ పంత్ స్ధానంలో పోరెల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ను తమ జట్టులోకి తీసుకోంది.
అతడిని రూ.20లక్షల బేస్ ప్రైస్‌కు ఢిల్లీ సొంతం చేసుకుంది. కాగా గతేడాది సీజన్‌లో బ్యాటర్‌గా పెద్దగా అకట్టుకోపోయినప్పటికి వికెట్ కీపర్‌గా మాత్రం ఆకట్టుకున్నాడు. ఐపీఎల్-2024 సీజన్‌కు పంత్ అందుబాటులోకి వచ్చినప్పటికి పోరెల్‌ను ఢిల్లీ రిటైన్ చేసుకుంది. ఢిల్లీ ఫ్రాంచైజీ నమ్మకాన్ని పోరెల్ నిలబెట్టుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.
𝐓𝐡𝐞 𝐈𝐦𝐩𝐚𝐜𝐭 👊
— IndianPremierLeague (@IPL) March 23, 2024
Abhishek Porel delivered and provided the late flourish for @DelhiCapitals 👏 👏
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvDC pic.twitter.com/8awvqO712N
Comments
Please login to add a commentAdd a comment