టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తాను చేసిన పరుగులు ఎంతో విలువైనవి అంటున్నాడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. లో స్కోరింగ్ మ్యాచ్‌లో వికెట్ల మధ్య పరుగులు తీసి తానూ జట్టు విజయంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నాడు.
న్యూయార్క్ వేదికగా టీమిండియా ఆదివారం పాకిస్తాన్‌తో తలపడిన విషయం తెలిసిందే. బౌన్స్‌కు అనుకూలించిన నసావూ కౌంటీ పిచ్‌పై పరుగులు రాబట్టేందుకు బ్యాటర్లంతా తిప్పలుపడ్డారు.
ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో కేవలం 119 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ(13), విరాట్ కోహ్లి(4) పూర్తిగా నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ రిషభ్ పంత్ 42 పరుగులతో రాణించాడు.
అతడి తర్వాతి స్థానాల్లో వచ్చిన అక్షర్ పటేల్ 20 రన్స్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 7, శివం దూబే 3, హార్దిక్ పాండ్యా 7, రవీంద్ర జడేజా 0, అర్ష్‌దీప్ సింగ్ 9, జస్‌ప్రీత్ బుమ్రా 0 పరుగులు చేశారు.
ఇక పదకొండో స్థానంలో వచ్చిన మహ్మద్ సిరాజ్ ఏడు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ రన్స్ కూడా డబుల్స్((రెండుసార్లు పాక్ బౌలర్ల ఓవర్ త్రో))ద్వారా లభించినవే.
అయితే, లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ భారత బౌలర్ల ధాటికి తడబాటుకు గురై 113 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో టీమిండియాను విజయం వరించింది.
అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా(3/14)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక సిరాజ్ దాయాదితో మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 19 పరుగులు ఇచ్చాడు. కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ ఇంటర్వ్యూలో మాట్లాడిన మహ్మద్ సిరాజ్.. కీలక సమయంలో బ్యాట్‌తో రాణించేందుకు కూడా తను నెట్స్‌లో తీవ్రంగా శ్రమించానని చెప్పుకొచ్చాడు.
ఒక్కోసారి టెయిలెండర్ల పాత్రనే కీలకంగా మారుతుందని.. పాక్‌తో మ్యాచ్‌లో తాను సాధించిన ఏడు పరుగులు ఎంత ముఖ్యమైనవో తెలిసి వచ్చిందని పేర్కొన్నాడు.
జట్టును గెలిపించే క్రమంలో కీలక సమయంలో రాణించడం పట్ల తనకెంతో సంతోషంగా ఉందని హైదరాబాదీ స్టార్ సిరాజ్ హర్షం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో తెలుసునని.. అయితే, ఒత్తిడి దరిచేయనీయకుండా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్లు వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment