భారత్ క్రికెట్ తరపున అంతర్జాతీయ స్ధాయిలో సత్తా చాటేందుకు మరో తెలుగు తేజం సిద్దమయ్యాడు. అతడు ఎవరో కాదు మన హైదరాబాదీ కుర్రాడు, ముంబై ఇండియన్స్ యువ సంచలనం నంబూరి ఠాగూర్ తిలక్ వర్మ. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యల జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కింది.
గత రెండు ఐపీఎల్ సీజన్‌లలో దుమ్మురేపిన తిలక్ వర్మకు అందరూ ఊహించినట్లే సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. తిలక్‌కు చోటు దక్కడంపై కేవలం తెలుగు వారు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరీ తిలక్ వర్మ..
ఒక సాధారణ ఎలక్ట్రీషియన్ కుటుంబంలో పుట్టి భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే స్ధాయికి చేరుకున్న తిలక్ వర్మ.. తన జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. పువ్వుపట్టగానే పరిమిళస్తుంది అనేలా చిన్నప్పుడే క్రికెటర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు ఈ నంబూరి ఠాగూర్ తిలక్ వర్మ. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. క్రికెట్ కిట్ కొనాలంటే కూడా అప్పుచేయాల్సిన పరిస్థితి తిలక్ వర్మ కటుంబానిది.
తిలక్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం అతడి తండ్రి నంబూరి నాగార్జున. అతడి తండ్రి చాలా కష్టపడ్డి తిలక్ కలలను సాకారం చేశాడు. తమ అర్ధిక కష్టాలను తిలక్‌కు తెలిజేయకుండా తన బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేశాలా తోడ్పడ్డాడు. నాగార్జున రూపాయి రూపాయి కూడబెట్టి శిక్షణ కోసం తిలక్‌ను లీగాలా స్పోర్ట్స్ అకాడమీలో చేర్పించాడు.
అయితే ఆ అకాడమీలో కోచ్ సలామ్ బయాష్ తిలక్ వర్మను టాలెంట్‌ను గుర్తించాడు. తిలక్‌ను ఒక స్టార్ క్రికెటర్‌గా తీర్చిదిద్దాలనుకున్న కోచ్ సలామ్ .. అతడి ట్రైనింగ్ ఖర్చు మొత్తాన్ని తనే భరించాడు. అతడి స్కిల్స్‌ను మరింత మెరుగుపరిచి రోహిత్ శర్మ, బుమ్రా వంటి స్టార్ క్రికెటర్‌లతో డ్రస్సింగ్ రూమ్‌ను షేర్‌చేసుకునేలా చేశాడు.
ఐపీఎల్‌లో అదరగొట్టి..
తిలక్ వర్మ దేశవాళీ క్రికెట్‌లో హైదారాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మ ఆ తర్వాత వెనుక్కి తిరిగి చూడలేదు. 2018-19 రంజీ సీజన్‌లో ఆంధ్రా జట్టుపై ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. అక్కడ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన వర్మ.. 2018-19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో టీ20లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం లిస్ట్-ఏ క్రికెట్‌లో తన మార్క్‌ను చూపించాడు ఈ లెఫ్టాండర్.
2019-20 విజయ్‌హాజరే ట్రోఫీతో తన లిస్ట్-ఏ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత 2020 అండర్-19 ప్రపంచకప్ భారత జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కింది. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో కూడా తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ.20 లక్షల ప్రాథమిక ధరతో వచ్చిన అతడి కోసం ఫ్రాంఛైజీలు గట్టిగా పోటీ పడ్డాయి.
ముంబై ఇండియన్స్ తిలక్‌ను రూ.1.7 కోట్లు పెట్టి మరి కొనుగోలు చేసింది. అందుకు తగ్గ న్యాయం తిలక్ చేసేశాడు. ఆ సీజన్లో 14 మ్యాచ్‌లాడి 36.09 సగటుతో 303 పరుగులు చేసి ముంబై తరఫున రెండో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్‌లో కూడా అతడు అదరగొట్టాడు. 11 మ్యాచ్‌ల్లో 42.87 సగటుతో 343 పరుగులు సాధించాడు. మిడిలార్డర్‌లో అద్భుతంగా ఆడే సత్తా వర్మకు ఉంది. భారత సీనియర్ జట్టు తరపున కూడా అద్బతంగా రాణించాలని కోరుకుంటూ ఆల్‌ది బెస్ట్ తిలక్ వర్మ
విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
చదవండి: IND vs WI: మీకు ఓవరాక్షన్ స్టారే దొరికాడా.. చెత్త సెలక్షన్! వాళ్లు ఉండాల్సింది!
Comments
Please login to add a commentAdd a comment