దుబాయ్: ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆగస్టు నెలకు గాను నామినేట్ అయ్యాడు. బుమ్రాతో పాటు పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిది, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కూడా పోటీపడుతున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్లు తీసుకున్న బుమ్రా.. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించాడు. మహ్మద్ షమీతో కలిసి 9వ వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. ఈ టెస్టులో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.
ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ టీమిండియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో చెలరేగి ఆడుతున్నాడు. వరుస సెంచరీలతో కదం తొక్కిన రూట్ ఇటీవలే టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. భారత్‌తో జరిగిన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు బాదిన రూట్ 105.81 సగటుతో 528 పరుగులు సాధించాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో షాహిన్ బౌలింగ్‌లో చెలరేగాడు. ఆ సిరీస్‌లో మొత్తంగా 18 వికెట్లు పడగొట్టిన షహీన్.. రెండో టెస్టులో ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. షాహిన్ అఫ్రిది రాణింపుతో పాక్ ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది.
చదవండి: 'రహానేను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది'
ఇక ఐసీసీ వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గరు మహిళా క్రికెటర్లు ఎంపిక కాగా.. ఇద్దరు ఐర్లాండ్‌కే చెందినవారు కాగా .. మరొకరు థాయ్‌లాండ్‌కు చెందినవారు ఉన్నారు. గాబీ లూయిస్, ఈమియర్ రిచర్డ్‌సన్, నట్టాయా బూచాతమ్‌లు ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. కాగా గాబీ లూయిస్ టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి ఐరీష్ క్రికెటర్‌గా నిలవగా.. ఇక రిచర్డ్‌సన్ ఐసీసీ టీ20 వుమెన్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి టీ20 చరిత్రలో రికార్డు సృష్టించింది. ఇక థాయ్‌లాండ్ మహిళా క్రికెటర్ నట్టాయా బూచాతమ్ జింబాబ్వేపై సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించింది.
చదవండి: కోహ్లి విషయంలో మొయిన్ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment