అడిలైడ్: ప్రతీసారి ప్రత్యర్ధిని ఆలౌట్ చేసే బాధ్యత బుమ్రా ఒక్కడే తీసుకోలేడని... తక్కిన వాళ్లు కూడా పంచుకోవాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో పరాజయం అనంతరం రోహిత్ మాట్లాడుతూ... "రెండు ఎండ్‌ల నుంచి బుమ్రాతోనే బౌలింగ్ చేయించలేము కదా అని అసహనం వ్యక్తం చేశాడు.
‘మేము ఒక్క బౌలర్‌తోనే మ్యాచ్ ఆడటం లేదు. ఇతరులు కూడా జట్టును గెలిపించే బాధ్యత తీసుకోవాలి. సిరాజ్, హర్షిత్, నితీశ్, ఆకాశ్‌దీప్, ప్రసిధ్ కృష్ణ ఇది అందరికీ వర్తిస్తుంది. కొందరు బౌలర్లు టెస్టు క్రికెట్‌లో ఇటీవలే అరంగేట్రం చేశారు.
అలాంటి వారికి ఆత్మవిశ్వాసాన్నివ్వడం చాలా ముఖ్యం. వారు ఎప్పుడు మ్యాచ్ ఆడిన అండగా ఉంటాం. కానీ మ్యాచ్ మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు వైపుల నుంచి బుమ్రా ఒక్కడే బౌలింగ్ చేయలేడు కదా. బౌలర్లను వాడుకోవడంపై చర్చించుకుంటాం.
స్పెల్ పూర్తి చేసిన ప్రతి సారి బుమ్రాతో మాట్లాడతా. ఉల్లాసంగా ఉన్నాడా లేడా అని అడిగి తెలుసుకుంటా. ఎందుకంటే ఇది ఐదు మ్యాచ్‌ల సిరీస్... అతడు అన్ని మ్యాచ్‌లు ఇదే ఉత్సాహంతో ఆడాలని కోరుకుంటున్నాం.
తొలి టెస్టులో హర్షిత్ రాణా జట్టుకు అవసరమైన కీలక సందర్భాల్లో వికెట్ తీశాడు. కొన్నిసార్లు నాణ్యమైన బ్యాటర్లు ఒత్తిడిలో పడేస్తారు. రెండో టెస్టులో అదే జరిగింది. అంత మాత్రాన హర్షిత్‌ను నిందించడానికి అతడిలో తపన ఉంది. దాన్ని ప్రోత్సహిస్తాం. రెండు మ్యాచ్‌ల్లోనే ఒక ప్లేయర్‌పై అంచనాకు రాలేము.
భారత్, ఆ్రస్టేలియా మధ్య సిరీస్ అంటే ఉద్వేగాలు ఎక్కువ. ఇందులో భాగంగానే సిరాజ్, హెడ్ మధ్య మాటల యుద్ధం సాగింది. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆసీస్ గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గాలంటే స్కోరు బోర్డుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు నమోదు చేయాల్సిందే.
దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో అది చేయలేకపోయాం. తొలి ఇన్నింగ్స్‌లో మరిన్ని పరుగులు చేసి ఉండాల్సింది. అక్కడే పొరబాటు జరిగింది’ అని రోహిత్‌శర్మ వెల్లడించాడు.
చదవండి: ENG vs NZ: జో రూట్ సూపర్ సెంచరీ.. ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డు సమం
Comments
Please login to add a commentAdd a comment