John Cena Shares Picture Of MS Dhoni In Classic You Cant See Me-Pose - Sakshi
Sakshi News home page

#johnCena: ధోని క్రేజ్‌.. ఐపీఎల్‌ ఫాలో అవుతున్నాడా?

Published Sat, May 6 2023 4:56 PM | Last Updated on Sat, May 6 2023 5:23 PM

John Cena Shares Picture Of MS Dhoni In Classic You Cant See Me-Pose - Sakshi

Photo: IPL Twitter

డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ జాన్‌ సీనా ధోని క్రేజ్‌కు ఫిదా అయ్యాడు. తన సిగ్నేచర్‌ గెస్టర్‌ 'You Cant See me'ని ఇటీవలే లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ధోని అనుకరించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ సందర్భంగా మహీష్‌ తీక్షణ అప్పీల్‌ను అంపైర్‌ అనిల్‌చౌదరీ తిరస్కరించారు. 

దీంతో వికెట్ల వెనకాల ఉన్న ధోని తీక్షణవైపు చూస్తూ తాను యాక్షన్‌ను సరిగ్గా చూడలేకపోయానని అర్థమయ్యేలా చెప్పడానికి తన చేతును ముఖానికి అడ్డంగా ఉపాడు. ఇది అచ్చం జాన్‌సీనా 'You Cant See me' సిగ్నేచర్‌ను పోలి ఉండడంతో వెంటనే వైరల్‌ అయింది. ధోని 'You Cant See me' ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన అభిమానులు తమ సంతోషాన్ని పంచుకున్నారు.

తాజాగా శనివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జాన్‌సీనా ధోని 'You Cant See me' సిగ్నేచర్‌ ఫోటోను స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడం ఆసక్తి కలిగించింది. అయితే కేవలం ఫోటో మాత్రమే పెట్టిన జాన్‌సీనా ఎలాంటి క్యాప్షన్‌ జత చేయకపోయవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

చదవండి: ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement