
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో హైదరాబాద్ స్విమ్మర్ చల్లగాని అభిలాష్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజత పతకం సాధించాడు. బెంగళూరులో జరిగిన ఈ గేమ్స్‌లో అభిలాష్ 4ని. 19.86 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థి అభిలాష్ జేఎన్‌టీయూ తరఫున పాల్గొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment