IND VS SA 3rd ODI: చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌ | KL Rahul Creates History By Winning A ODI Series After Virat Kohli In South Africa | Sakshi
Sakshi News home page

IND VS SA 3rd ODI: చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌

Published Fri, Dec 22 2023 8:35 AM | Last Updated on Fri, Dec 22 2023 11:03 AM

KL Rahul Created History By Winning A ODI Series After Virat Kohli In South Africa - Sakshi

టీమిండియా తాత్కాలిక వన్డే జట్టు సారధి కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత సాధించాడు. విరాట్‌ కోహ్లి తర్వాత సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో ఓడించిన కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. విరాట్‌ 2017/18లో తొలిసారి సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో ఓడించాడు.

నాటి సిరీస్‌లో విరాట్‌ నేతృత్వంలోని టీమిండియా సౌతాఫ్రికాను 5-1 తేడాతో చిత్తు చేసింది. మళ్లీ ఇనేళ్లకు రాహుల్‌ సఫారీలను వారి హోం పిచ్‌పై వన్డే సిరీస్‌లో ఓడించాడు. ప్రస్తుత పర్యటనలో భాగంగా జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 

పార్ల్‌ వేదికగా నిన్న (డిసెంబర్‌ 21) జరిగిన సిరీస్‌ డిసైడర్‌లో టీమిండియా 78 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో టీమిండియాకు ఇది 27 విజయం. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. 2003లో ఆస్ట్రేలియా 30 విజయాలు సాధించి, ఈ జాబితాలో టాప్‌లో ఉంది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. సంజూ శాంసన్‌ (108), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4/30) చెలరేగడంతో నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా సౌతాఫ్రికాను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో   8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్‌ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్‌ (38) తనదైన స్టయిల్‌లో మెరుపులు మెరిపించాడు.

అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ , వాషింగ్టన్‌ సుందర్‌ (2/38), ఆవేశ్‌ ఖాన్‌ (2/45), అక్షర్‌ పటేల్‌ (1/48), ముకేశ్‌ కుమార్‌ (1/56) రాణించడంతో 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement