
ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 33 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 6 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 57 పరుగులు సాధించాడు.
కాగా ఈ మ్యాచ్‌లో రాహుల్.. ధోనిని తలపిస్తూ అద్భుతమైన హెలికాప్టర్ షాట్ ఆడాడు. భారత ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ వేసిన పాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో రాహుల్ హెలికాప్టర్ షాట్ ఆడి సిక్సర్‌గా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక భారత తమ తదుపరి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో బుధవారం తలపడనుంది.
చదవండి: కొట్టాలనే మూడ్ లేదు.. ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment